తెలంగాణలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్.. HYD కు దగ్గరలో.. ఏమి అందాలు సామి..!
ఓ వైపు అభయారణ్యం, మరోవైపు పెద్ద పులుల ఘీంకారం.. ఎటు చూసినా మంచుతో కప్పిన కొండలు.. వాటి మధ్యలో సెలయేర్లుగా పారుతున్న కృష్ణానది హొయలు ఇవన్నీ తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాయని మీకు తెలుసా..? ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఉంది. అయితే గత మూడు నెలలుగా ఈ టైగర్ రిజర్వ్ లో సందర్శన నిలిపివేశారు. కానీ అక్టోబర్ 1 నుంచి తిరిగి ప్రారంభించారు. ఓవైపు అమ్రాబాద్ అభయారణ్యంలోని పలు పర్యాటక ప్రాంతాల అందాలు, మరోవైపు కృష్ణా నది పరవళ్లను తిలకించేందుకు రెండు ప్యాకేజీలుగా పర్యటనలకు వీలు కల్పిస్తోంది. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
జంగిల్ సఫారీ ట్యూర్ ప్యాకేజీ కింద అమ్రాబాద్ అడవుల్లో హాయిగా విహరించే సదుపాయం కల్పిస్తోంది. ఈ ప్యాకేజీని ఆన్ లైన్ లో సందర్శించి బుక్ చేసుకోవచ్చు. కపుల్స్ కు రూ. 6 వేలు ఉంటుంది. అలాగే పిల్లలు ఉంటే రూ. 1500 అదనంగా ఛార్జ్ చేస్తారు. ఈ సఫారీలో ఆక్టోపస్ వ్యూపాయింట్, వజ్రాల మడుగు, వాచ్ టవర్ నుంచి కృష్ణా నది సందర్శన చేయవచ్చు. అలా సాయంత్రం కాటేజ్ వద్దకు చేరుకుంటారు. తర్వాతి రోజు అక్కమహాదేవి గుహలు, కృష్ణానది అందాలు, బోటింగ్ ఉంటాయి.
అక్క మహాదేవి గుహల విషయానికి వస్తే ఈ గుహల ముందు భారీ శిలాతోరణం ఉంటుంది. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఉంది. ఇక దోమలపెంట సమీపంలో ఉండే ఆక్టోపస్ పాయింట్ నుంచి వీక్షిస్తే కృష్ణా నది ఆక్టోపస్ లా కనిపిస్తుంది. దోమలపెంట సమీపంలోనే ఉండే వజ్రాల మడుగులో ఒకప్పుడు వజ్రాలు లభించేవని ప్రతీతిగా ఉంది.

అలాగే అమ్రాబాద్ మండలంలోని హైదరాబాద్-శ్రీశైలం రోడ్డు సమీపంలో ఫర్హాబాద్ వ్యూ పాయింట్ ఉంది. దీనికి సెపరేట్ ప్యాకేజీ ఉంది. ఫర్హాబాద్ నుంచి ఈ సఫారీ ప్రారంభమవుతుంది. మన్ననూర్ లో కాటేజ్‌లు, వసతి గదులు ఉన్నాయి. వీటిలో బస చేసేందుకు రోజుకు ధర రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఉంటుంది. రెండు రోజుల్లో ఈ టూర్ పూర్తవుతుంది.












Click it and Unblock the Notifications