ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు ఆంధ్రజ్యోతి సంస్ధల ఎండీ..!

తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఈ వయవహారం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, హైకోర్టు న్యాయమూర్తుల వరకు అనేకమంది వ్యక్తులపై నిఘా పెట్టినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే వెల్లడించింది. అలానే ఈ కేసులో బాధితుల లిస్ట్ కూడా రోజురోజుకీ మరింత పెరుగుతోంది.

ఈ క్రమంలోనే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సంస్ధల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సిట్‌ అధికారులు నిన్న ( జూన్ 26, గురువారం ) నోటీసులు జారీ చేశారు. ఈరోజు ( జూన్ 27, 2025 ) ఉదయం 11 గంటలకు సిట్‌ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని కోరారు. ఎస్‌ఐబీ వద్ద ఉన్న కాల్‌ డిటైల్‌ రికార్డ్స్‌(సీడీఆర్‌)లో తన ఫోన్‌ నంబర్‌ కూడా ఉండటంతో కేసు విచారణలో భాగంగా మీ వాంగ్మూలం అవసరం ఉందని నోటీసులో పేర్కొన్నారు. సిట్‌ అధికారులు ఇచ్చిన నోటీసు మేరకు రాధాకృష్ణ విచారణకు హజరు కానున్నారని సమాచారం.

andhra-jyothi-md-vemuri-radha-krishna-for-enquiry-in-phone-tapping-case

మరోవైపు చేవెళ్ల ఎంపీ, బీజేపీ సీనియర్‌ నాయకులు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ అయ్యిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే విచారణకు రావాలని ఆయనకు కూడా సిట్‌ నుంచి పిలుపు అందినట్లు సమాచారం.

ఇక వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. షర్మిల ఆరోపణల ప్రకారం, తన ఫోన్ సంభాషణలు అత్యంత గోప్యంగా ట్యాప్ చేయబడ్డాయి. ఆ సమాచారం తన అన్న, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చేరిందన్న అనుమానం ఆమె వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా, తన సంభాషణల కోసం ప్రత్యేకంగా కోడ్ భాష ఉపయోగించినట్లు కూడా వెల్లడించారు.

షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు జగన్‌కు చేరవేసేలా వ్యవస్థ పనిచేసినట్లు సమాచారం. ఆమె వ్యక్తిగత సంభాషణలు, రాజకీయ నాయకులతో సంప్రదింపుల వివరాలు కూడా ఈ నిఘాలో భాగమయ్యాయని తెలుస్తోంది. షర్మిల దగ్గర ఉన్నవారికి ఓ సీనియర్ పోలీస్ అధికారి హెచ్చరికలు జారీ చేసినట్లు గుర్తించారు. ట్యాపింగ్ జరుగుతోందన్న అనుమానంతో షర్మిల అప్పుడే తన వ్యక్తిగత ఫోన్లను మార్చినట్లు చెప్పారు. అలాగే తన గోప్యతను కాపాడుకునేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు. ప్రస్తుతం ఈ ఆరోపణల నేపథ్యంలో షర్మిల వద్ద కొన్ని కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో షర్మిల స్టేట్‌మెంట్ తీసుకునే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జడ్పీ చైర్‌పర్సన్ సరిత వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షర్మిలను కూడా సాక్షిగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+