హైదరాబాదులో మరో ట్రిపుల్ మర్డర్: భార్య, పిల్లల్ని చంపి లొంగిపోయిన భర్త
హైదరాబాద్: నగరంలో మరో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో భర్తనే భార్యను, తన పిల్లలను దారుణంగా చంపేశాడు. మృతుడు హరీందర్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు.
హరీందర్, జ్యోతిలు(33) భార్యాభర్తలు. వారికి అభిజిత్ (6), సహస్ర (4) ఇద్దరు పిల్లలు. హరీందర్ గత కొందకాలంగా ఉద్యోగం మానేసి ఖాళీగా ఇంట్లో ఉంటున్నాడు. ఈ విషయమై ఇరువురి మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తనను నిత్యం వేధిస్తున్నందున భార్యను, పిల్లలను చంపినట్లు నిందితుడు పోలీసుల ఎదుట చెప్పాడని తెలుస్తోంది. ఈ సంఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications