Anuradha: ప్రభాకర్ రెడ్డి కోసమే డ్రగ్స్ దందాలోకి దిగాను.. పోలీసుల విచారణలో అనురాధ..
డ్రగ్స్ కేసులో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని, మహిళా డ్రగ్స్ సరఫరాదారు లింగంపల్లి అనురాధ అలియాస్ అన్నపూర్ణను పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని పేర్లు బయటకు వచ్చాయి. ప్రభాకర్ రెడ్డి, అనురాధను రాజేంద్రనగర్ ఎస్వోటీ, మోకిల పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు అనురాధను విచారించగా.. నలుగురి పేర్లను బయటపెట్టినట్లు తెలిసింది. అనురాధ హర్షవర్ధన్ రెడ్డి, వినీత్ రెడ్డి, రవి, గోవాలో డ్రగ్స్ అమ్మే జేమ్స్ పేర్లను పోలీసులకు చెప్పింది.
రవి, వినీత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి అడ్రస్ తన వద్ద లేని అనురాధ పోలీసులకు తెలిపారు. తమంతా పబ్బుల్లోనే కలిసేవారిమని పేర్కొంది. పబ్బుల్లోనే డ్రగ్స్ విక్రియించేవారమని తెలిపింది. గోవా వెళ్తున్న క్రమంలో జేమ్స్ పరిచయమయ్యాడని.. గోవా వెళ్లి జేమ్స్ తో మాట్లాడడం.. డ్రగ్స్ ను గుట్టుగా నగరానికి తీసుకొచ్చేవారమని విచారణలో అనురాధ ఒప్పుకుంది. అయితే తాను ప్రేమించిన ప్రభాకర్ రెడ్డి కోసమే డ్రగ్స్ దందా చేసినట్లు అనురాధ పోలీసులకు చెప్పింది. డ్రగ్స్ సరఫరాలో అనురాధను పావుగా వాడుకున్నారని తెలుస్తోంది.

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లకు చెందిన అనురాధ ఎంబీఏ పూర్తి చేసింది. హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేరు కంపెనీలో ఉద్యోగం సాధించింది. మంచి జీతంతో పని చేసేది. ఈ క్రమంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విభేదాలతో భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత అనురాధ క్రమంగా డ్రగ్స్ అలవాటు చేసుకున్నట్లు తెలిసింది. ప్రగతి నగర్ లో ఉండే ఓ స్నేహితుడి ద్వారా గోవాలో ఉండే జేమ్స్ తో అనురాధ పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలోనే గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది.

కొద్ది రోజుల తర్వాత వారి పరిచయం బాగా దగ్గరయింది. ఆ తర్వాత డ్రగ్స్ వినియోగం, సరఫరా విషయం ప్రభాకర్ రెడ్డికి వివరించింది. దీంతో అతను అనురాధ ద్వారా డ్రగ్స్ తెప్పించి పరిచయస్తులకు అమ్మేవాడు. ఆ తర్వాత వీరికి పల్లెటూరు పుల్లట్లు టిఫిన్ సెంటర్ వెంకటశివ సాయి కుమార్ వీరికి పరిచయం అయ్యాడు. అతని కూడా వీరు డ్రగ్స్ అమ్మేవారు. డ్రగ్స్ ను గచ్చిబౌలి, కూకట్ పల్లి, బంజారాహిల్స్, ఇతర ప్రాంతాల్లో ఉన్న కస్టమర్లకు విక్రయించేవారు.












Click it and Unblock the Notifications