జూబ్లీహిల్స్ లో రేవంత్ ఓట్ బ్యాంక్ కు పవన్ గండి, కీలక మలుపు..!!
జూబ్లీహిల్స్ ఎన్నికల రాజకీయంలో బిగ్ టర్న్. ఇక్కడ గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మ కంగా మారింది. పోలింగ్ సమీపిస్తున్న వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. సర్వే నివేదికలు పార్టీల్లో టెన్షన్ పెంచుతున్నాయి. ఇదే సమయంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేనాని పవన్ ఎన్నికల ప్రచార బరిలోకి దిగటానికి షెడ్యూల్ ఖరారైంది. రేవంత్ తొలి నుంచి వ్యూహాత్మకంగా కాపాడుకుంటున్న ఓట్ బ్యాంక్ పైన ఇప్పుడు పవన్ గురి పెట్టారు. దీంతో.. ఎన్నికల వేళ ఇది కీలక మలుపుగా మారుతోంది.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార బరిలోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలతో జనసేన నాయకులు చర్చలు చేసారు. బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఒక రోజు రోడ్-షో, బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించాలని బిజెపి నాయకులు నిర్ణయించారు. బిజెపికి మద్దతుగా తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తారు. జూబ్లీహిల్స్ లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి.

దీంతో, రేవంత్ అటు ఎంఐఎం సహకారం.. ఇటు బీసీ అభ్యర్ధిని బరిలోకి దించటం.. అజారుద్దీన్ కు మంత్రి పదవి వంటి నిర్ణయాలు అమలు చేసారు. కమ్మ సామాజిక వర్గం తో పాటుగా సినీ పరిశ్రమ మద్దతు కోసం నేరుగా మంత్రాంగం చేసారు. టీడీపీ ఇప్పటి వరకు ఈ ఎన్నిక పైన ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో... 2023 ఎన్నికల తరహాలోనే టీడీపీ మద్దతు దారులు ఉప ఎన్నికలో కాంగ్రెస్ వైపు నిలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లెక్కలు మారుతున్నాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో సినీ పరిశ్రమకు చెందిన వారు 30వేలు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 25వేల మందికిపైగా ఉన్నారు. వారి ఓట్లను ఆకట్టుకోవాలంటే పవన్ ను ప్రచారానికి రప్పిస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఈ నియోజకవర్గం లోకమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన వారు.. కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువే.
ఆ ఓట్లన్నీ బీజేపీ వైపు మళ్లాలంటే టీడీపీ సహకారంతో పాటుగా పవన్ కల్యాణ్ ను రంగంలోకి దింపాలని బీజేపీ వ్యూహాన్ని రచిస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. ఏపీకి చెందిన బీజేపీ నేతలు ఇప్పటికే ఇక్కడ తమ పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగారు. ఇక.. పవన్ బరిలోకి దిగితే సామాజిక సమీకరణాల మద్దతు లెక్కలు మారటం తో పాటుగా ఫలితం పైన ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తోంది. దీంతో, కాంగ్రెస్ నేతలు అలర్ట్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications