దొందూదొందే: విమర్శలంటే ’చంద్రుల’కు మంట

రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన సాగిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (తెలంగాణ), నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్)లకు మాత్రం విమర్శలంటే స్వీకరించే ఓపిక, సంయమనం పాటించే పరిస్థితి గానీ లేవు.

హైదరాబాద్/ అమరావతి: తన దాక వస్తే గానీ అసలు సంగతి తెలియదంటారు పెద్దలు. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనది ప్రజాస్వామ్య దేశం. బావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉన్నది. కానీ అధికారంలో ఉన్నవారికి మాత్రం అది కంటగింపుగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన సాగిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (తెలంగాణ), నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్)లకు మాత్రం విమర్శలంటే స్వీకరించే ఓపిక, సంయమనం పాటించే పరిస్థితి గానీ లేవు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకున్నందుకు.. తర్వాత ఓటుకు నోటు కేసులో నిందితుడిగా చిక్కుకున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మొదలు ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలంటే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒంటికాలిపై లేచి ఎదురుదాడికి దిగడం ఆనవాయితీగా మారుతోంది.

మీడియా సమావేశాల్లో విమర్శలు చేయడం మొదలు ఒక ప్రముఖ దినపత్రిక సంపాదకీయం పేజీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ కథనాలు రాసిన నేతలపై కేసు పెడతామని టీఆర్ఎస్ నేతలు హెచ్చరికలు జారీచేసే వరకు వెళ్లారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 17వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర శివారుల్లో జరిగిన పార్టీ ప్లీనరీ సభ వేదిక నుంచి సీఎం, పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసులు పెడతామని హెచ్చరికలు జారీచేశారు.

ప్రజాస్వామ్య సంప్రదాయాలు పరిరక్షించాలి

ప్రజాస్వామ్య సంప్రదాయాలు పరిరక్షించాలి

తప్పుడు ఆరోపణలు ఉంటే వాస్తవాలతో వివరణలు తెలియజేస్తూ సమాధానం ఇవ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సంప్రదాయంగా వస్తున్నది. దానికి బదులు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విపక్ష నేతలపై కేసులు పెట్టేందుకు వెనుకాడబోమనడం విమర్శలను సహించబోమనడం నియంత్రుత్వ విధానాలకే కిందకే వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రెండుచోట్ల ఎలా సర్వేలో సమాచారం ఇస్తారని ప్రశ్నించినందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ఆ శాసనసభా సమావేశాల వరకు బహిష్కరణ వేటు కొనసాగించారు. విపక్షాలు అభ్యర్థించినా అధికార పక్షం పట్టించుకున్న దాఖలాలు లేవు.

మధ్యలోనే బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

మధ్యలోనే బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

తాజాగా బడ్జెట్ సమావేశాల్లోనూ, ఇటీవల రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతూ వచ్చింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముందు జరిగిన అసెంబ్లీ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశానికి అన్ని పార్టీల మాదిరిగానే టీడీపీకి ఆహ్వానం పంపారు. కానీ అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో బయటకు రావాల్సి వచ్చింది.

అడ్వకేట్ల జేఏసీ బహిరంగలేఖలు కూడా

అడ్వకేట్ల జేఏసీ బహిరంగలేఖలు కూడా

ప్రభుత్వ విధానాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రశ్నించినప్పుడు కూడా ఇదే ఆనవాయితీ కొనసాగింది. తెలంగాణ జేఎసీ చైర్మన్ కోదండరాంను ఏకాకిని చేసేందుకు ప్రభుత్వానికి మద్దతుగా అడ్వకేట్ల జేఏసీ కూడా బహిరంగ లేఖలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సీఎం కేసీఆర్ మినహా తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కోదండరాంపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కోదండరాంను ఒక ఎంపీ నాగుపాము అని కూడా సంబోధించారు. ఇక్కడ అర్థం గానీ పరిస్థితి ఒకటి ఉన్నది. విమర్శకులు చేసే వ్యాఖ్యలు, వెల్లడించే అభిప్రాయాలు వాస్తవ విరుద్ధమైతే అధికార పక్షం అంతగా స్పందించాల్సిన అవసరమే లేదు. ప్రజలు గతంలో మాదిరిగా గుడ్డిగా నమ్మే రోజులు పోయాయి. ప్రతి ఒక్కరూ అంతో ఇంతో విద్యాభ్యాసం చేశారు. కనుక ఎవరేం చెప్తున్నారో, ఎవరి వాదనలో నిజముందో తెలుసుకునే సామర్థ్యం వారిలో ఉన్నది. విమర్శకులు అబద్దాలు చెప్తే వారినే ఈసడించుకుంటారు. కానీ ఈ చిన్న సూత్రం కూడా తెలియని దుస్థితిలో అధికార పక్షం ఉన్నదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒంటికాలిపై లేచి విమర్శలు చేయడానికి బదులు ఆయా ఆరోపణల్లో వాస్తవాలు ఉంటే చర్యలు తీసుకుంటామని, పథకాల అమలులో సూచనలను స్వీకరిస్తామని చెప్తే అంతటితో వివాదమే చెరిగిపోతుంది.

ప్రజా జీవితంలో సంయమనం పాటించడం సంప్రదాయం

ప్రజా జీవితంలో సంయమనం పాటించడం సంప్రదాయం

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలిని కించపరిచే వ్యాఖ్య చేశారని రవి కిరణ్ అనే వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి వదిలేశారు. అంత వరకు బాగానే ఉన్నది. చట్టంలో నిబంధనల మాటున తమపై విమర్శకుల ఆట కట్టించేందుకు పాలకులు ఎందుకైనా సిద్ధమైనని రవికిరణ్ అరెస్ట్ తెలియజేస్తున్నది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సోషల్ మీడియా పరిధిని మించి వ్యవహరిస్తున్నదని ఘాటు వ్యాఖ్య చేశారు. దానికి కూడా కారణం ఉన్నది. ఇటీవలే పెద్దల సభగా పేరొందిన శాసనమండలికి సీఎం తనయుడు లోకేశ్ ఎన్నికవ్వడంతోపాటు తండ్రి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్క విషయం విస్మరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రజా జీవితంలోకి అడుగు పెట్టక ముందు ఎలా ఉన్నా.. అడుగు పెట్టిన తర్వాత సంభాళించుకుని మాట్లాడటం ఆనవాయితీ మంచి పద్దతి కూడా. కానీ మంత్రిగా నారా లోకేశ్ మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వాస్తవ విరుద్దమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం గమనంలోకి తీసుకోవాల్సి ఉన్నది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని వర్ధంతి అని లోకేశ్ వ్యాఖ్యానించడం ఎంత వరకు సబబో ఆయన, ఆయన తండ్రి - ఏపీ సీఎం చంద్రబాబు తెలుసుకుంటే మంచిదని రాజకీయ విమర్శకులు అంటున్నారు.

175 స్థానాలకు 200 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపిస్తారా?

175 స్థానాలకు 200 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపిస్తారా?

ఒక జిల్లాలో జరిగిన కార్యక్రమంలో నీటి ఎద్దడి సమస్య ఏర్పాటు చేస్తానని మంత్రి హోదాలో లోకేశ్ వ్యాఖ్యానించారు. మరో అడుగు ముందుకేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 200 స్థానాల్లో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు మొదలు రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ఎమ్మెల్యే స్థానాల గురించి వాస్తవిక ద్రుక్ఫథం అలవరుచుకోవడం ప్రజా నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించే వారి ప్రథమ కర్తవ్యమని వేరే చెప్పనవసరం లేదని విమర్శకులు అంటున్నారు. దాన్ని విస్మరించి తమపై, తమ విధానాలపై విమర్శలు చేస్తే సహించరానవని నిర్దారణకు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రారంభ దశలో ఉన్నప్పుడు స్క్రిప్టు రాసుకుని సమావేశాలకు హాజరయ్యే విధానాలేమైనా ఉంటే ఆచరించడం సబబన్న సంగతి కూడా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ విస్మరించినట్లు ఉన్నారు. తమ అనుకూల మీడియా ఉన్నంత వరకు తిరుగు లేదని భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా మీడియాసంస్థలు ఉన్నాయి. సోషల్ మీడియా ప్రజా వ్యతిరేక, సంప్రదాయ విరుద్ద వ్యాఖ్యలను, విదానాలను ఖండిస్తూనే ఉంటుంది, ప్రజల్లోకి చొచ్చుకెళ్తుందన్న సంగతి విస్మరిస్తే చివరికి ఫలితం అనుభవించే వారు ఏలినవారేనని గుర్తుంచుకోవాలని విశ్లేషకులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+