TSPSCలో కొత్త నియామకం.. అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా ఎన్.జగదీశ్వర్ రెడ్డి..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా ఎన్ జగదీశ్వర్ రెడ్డిని నియమించింది. ఇందుకు సంబంధి ఉత్తర్వులు కూడా ఇచ్చింది. జగదీశ్వర్ రెడ్డి ప్రస్తుతం గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు. డిప్యూటేషన్‌పై వచ్చిన జగదీశ్వర్‌రెడ్డి రెండేళ్లు టీఎస్‌పీఎస్సీలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-1, ఏఈ పేపర్ లీక్ కావడంతో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తన ఆందోళనలు జరిగాయి.
దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పరీక్షలను సజావుగా నిర్వహించేలా సంస్కరణలు తీసుకొచ్చింది. అందుకే ఇటీవల టీఎస్పీఎస్సీలో అదనంగా పది పోస్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా పరీక్షల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశాలు ఇచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉండాలని యూపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది.

టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేలు విచారణ జరుగుతుండగానే పలువులు నిందితులకు బెయిల్ వచ్చింది. శుక్రవారం ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 8 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందిన వారిలో నీలేష్ నాయక్, కెతావత్ శ్రీనివాస్, రాజేందర్ నాయక్‌తో పాటు మరో ఐదుగురు ఉన్నారు. ఇదే కేసులో రేణుక రాథోడ్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్‌లో ఉన్న రేణుక గురువారం సాయంత్రం బెయిల్‌పై విడుదలయ్యారు.
నిందితులకు బెయిల్ రావడంపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిట్ విచారణ సరిగా లేదని విమర్శిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.పేపర్ లీకేజీ కేసులో నిందితులను మరోసారి తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంఎస్‌జే కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. రేణుక రాఠోడ్, రాజేశ్వర్, ఢాక్యా నాయక్, గోపాల్, నీలేష్.. ఈ ఐదుగురిని కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications