ఎత్తుకెళ్లారు! ఖాళీ చేసి వెళ్లండి: సీమాంధ్ర ఉద్యోగులకు టీఎస్పీఎస్సీ
హైదరాబాద్: తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఏపీపీఎస్సీ ఉద్యోగులు నకిలీ తాళం చెవితో కాన్ఫిడెన్షియల్ రూంలోకి ప్రవేశించి కీలక దస్త్రాలను తీసుకు వెళ్లారని టీఎస్‌పీఎస్సీ అధికారి విఠల్ శుక్రవారం నాడు చెప్పారు.
ఈ విషయాన్ని తాము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. మొదటి అంతస్తును అందరు ఉమ్మడిగా వాడుకోవాలని, 2, 3 అంతస్తులు తెలంగాణకు, 4, 5 అంతస్తులు ఏపీకి కేటాయించారని, ఇలా ఒప్పందం జరిగిందన్నారు.
ఈ ఒప్పందానికి గవర్నర్ ఆమోదం కూడా ఉందన్నారు. ఒప్పందం ప్రకారం ఏపీ ఉద్యోగులు రెండు, మూడు అంతస్తులను ఖాళీ చేయలేదని, దీంతో తాము ఐదో అంతస్తులో కాన్ఫిడెన్షియల్ రూం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.

శుక్రవారం సీమాంధ్ర ఉద్యోగులు కాన్ఫిడెన్షియల్ వింగ్‌లోకి అక్రమంగా ప్రవేశించారని, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తున్నందుకు రెండు అంతస్తులు సరిపోవడం లేదన్నారు. ఈ భవనం నుంచి ఏపీపీఎస్సీని ఖాళీ చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
తమకు సమాచారం ఇవ్వకుండానే మారు తాళంతో పైళ్లను తీసుకెళ్లారన్నారు. ఏపీ ఉద్యోగులు వెంటనే భవనాన్ని ఖాళీ చేయాలని, తెలంగాణ ఉద్యోగుల పనిని చేసుకోనివ్వాలన్నారు. మేం ఎక్కడ కూర్చొని పని చేసుకోవాలన్నారు.
కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల మధ్య శుక్రవారం మరో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో టీఎస్పీఎస్సీ కార్యాలయ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. నకిలీ తాళంతో టీఎస్పీఎస్సీ కార్యాలయం గది తలుపులు తెరిచి రహస్య సమాచార ఫైళ్లను కొందరు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే సీమాంధ్ర ఉద్యోగులే కీలక ఫైళ్లను అపహరించి ఉంటారని వీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న నాలుగు అంతస్తుల పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని రాష్ట్రం విడిపోయాక, రెండు ఫ్లోర్లు చొప్పున రెండు రాష్ట్రాల కమిషన్లకు కేటాయించారు. దాంతో ఉద్యోగుల రాకపోకలు ఒకే ద్వారం నుంచి జరుగుతుంటాయి.












Click it and Unblock the Notifications