Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ఫార్ములా ఈ- రేస్ కేసులో అనూహ్య పరిణామం

ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై విచారణకు అనుమతి కోరుతూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌ (DoPT)కు ఈ లేఖను పంపించారు. ఈ కేసులో అర్వింద్ కుమార్ ఏ2గా ఉన్నారు. ఈ కేసులో విచారణ చేపట్టడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇదివరకే అనుమతి సైతం ఇచ్చారు.

అర్వింద్ కుమార్ పై విచారణ జరపడానికి తాజాగా అనుమతి లభించింది ప్రభుత్వానికి. దీనికి అవసరమైన అనుమతులను డీఓపీటీ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అర్వింద్ కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు కూడా అనుమతి రావడంతో చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది.

Arvind Kumar Telangana senior IAS Officer set to face prosecution in Formula-E case after Centre nod

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేసులో సుమారు 55 కోట్ల రూపాయల అనధికారిక చెల్లింపులకు సంబంధించిన కేసు ఇది. ఈ చెల్లింపుల కేసులో అర్వింద్ కుమార్ పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2024 జనవరిలో అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు మెమో జారీ కూడా అయింది. ఫార్ములా ఈకి అనుమతి లేని నిధుల మంజూరు, వాటికి అధికారికంగా ఎటువంటి ఆమోదాలు లేకపోవడం, కంపెనీకి నిధులు చెల్లించడంపై వివరణ కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం.

2024 జనవరి 6న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ మెమో జారీ చేశారు. సచివాలయంలోని శాఖల ఆమోదం, అర్హత గల అధికారి అనుమతి లేకుండా నిర్ణయాలు, చెల్లింపులెందుకు జరిగాయని ప్రశ్నించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సమయంలో సీజన్-10 ఫార్ములా ఈకి సవరించిన ఒప్పందం కుదుర్చడంపై కూడా లేఖలో స్పష్టత కోరారు. అప్పట్లో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిధుల నుండి ఫార్ములా ఈకి రూ. 46 కోట్లు, పన్ను మరో తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించారు.

దీనికి కుదిరిన ఒప్పందంపై సంతకాలు చేయడానికి ముందే హెచ్ఎండీఏ బోర్డు.. అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే' ఈ మొత్తం చెల్లించినట్లు మెమోలో ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 299 ప్రకారం, కేంద్ర/రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించి చేసే ఒప్పందాలు రాష్ట్రపతి లేదా గవర్నర్ ద్వారా జరగాలి. మెమోపై అర్వింద్ కుమార్ స్పందించారు. అప్పటి మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలను పాటించానని వివరించారు.

దీని తర్వాత కేటీఆర్, అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు తాజాగా అర్వింద్ కుమార్ పై విచారణకు అనుమతి కోరుతూ డీఓపీటీకి లేఖ రాశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. డీఓపీటీ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఏసీబీ రంగంలోకి దిగే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+