రాష్ట్రపతి నిలయంలో 'ఎట్ హోమ్'

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన 'ఎట్ హోమ్'కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన 'ఎట్ హోమ్'కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారం రోజులుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్న విషయం విదితేమే.

ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో 'ఎట్ హోమ్'కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

 pranab mukharjee

ఇంకా తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పలువురు మంత్రులు, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పాల్గొన్నారు.

ఇంకా ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, సాయుధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటన ముగియడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ కి తిరుగు ప్రయాణం అవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+