ప్రభాకర్ రెడ్డిపై దాడి: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు, టీపీసీసీ చీఫ్ కౌంటర్, బీజేపీ నేతపై దాడి
హైదరాబాద్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖండించారు. నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భౌతికదాడులకు దిగుతోందని మండిపడ్డారు. తమ నేతలను భౌతికంగా అంతం చేసేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.
థర్డ్ రేట్ క్రిమినల్‌ను టీ పీసీసీ ప్రెసిడెంట్‌గా నియమించినప్పుడే.. ఇలాంటి ఘటనలు ఊహించొచ్చు. ప్రజాస్వామ్యంలో హింస, దాడులకు తావు లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డిపై దాడిని మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఖండించారు. నేడు దుబ్బాక్ బంద్ కు పిలుపునిచ్చారు.
మరోవైపు, కేటీఆర్ ఆరోపణలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదే స్థాయిలో స్పందించారు. దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీపై నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మొండి కత్తితో దాడి చేసింది కాంగ్రెస్ వ్యక్తి అని కేసీఆర్, కేటీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని.. దాడి ఘటనను కాంగ్రెస్ ఖాతాలో వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి బీజేపీకి చెందిన వ్యక్తి అని ఆరోపించిన రేవంత్.. చేతనైతే నిరూపించాలని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ సిద్ధాంతం అహింస.. కాంగ్రెస్ ఎప్పుడూ హింసకు పాల్పడదని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ను ఓడించాలని బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. దాడి జరిగిన వెంటనే ఇంటెలీజెన్స్ అధికారులు సీఎంకి వివరాలు అందిస్తారు. ఎవరు దాడి చేశారు.. ఎవరిపై దాడి చేశారు అనేది. బీజేపీ-బీఆర్ఎస్ పరస్పర దాడులు చేసుకుని.. నింద కాంగ్రెస్ పార్టీపై వేయాలని చూస్తున్నారన్నారు. వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న భయం పట్టుకుందని అన్నారు.
I strongly condemn the murder attempt on BRS MP Sri Prabhakar Reddy Garu by Congress Goons
— KTR (@KTRBRS) October 30, 2023
Desperate Congress now resorting to physical elimination attempts of our leaders in Telangana. This was of course to be expected with a 3rd rate Criminal being made the TPCC president… https://t.co/uqCVgYMaJO
బీజేపీ ఆఫీస్, నేతలపై దాడులు చేశారంటూ బీఆర్ఎస్‌పై రఘునందన్ ఫైర్
సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ పెద్ది నవీన్ ను ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. బీఆర్ఎస్ ఎంపీపై ఎవరో ఓ వ్యక్తి దాడి చేస్తే.. బీజేపీ నేతలు, కార్యకర్తలపై బీఆర్ఎస్ శ్రేణులు దాడులకు తెగబడటం దారుణమని అన్నారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యాలయంపై దాడులు చేశారన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా కేసులు పెట్టవద్దని సుప్రీంకోర్టు చెప్పినా.. పోలీసులు మాత్రం కేసులు పెడుతున్నారని రఘునందన్ మండిపడ్డారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా లేకనే దాడులు చేస్తున్నారన్నారు.
మంగళవారం నాటి బంద్ కు సిద్దిపేట సీపీ సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మంగళవరాం ఉదయం వరకు వేచిచూసిన తర్వాత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి ఏ పార్టీకి చెందినవారో విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications