పిల్లలతో సహా ట్యాంక్‌బండ్‌లో దూకేందుకు ఆటోడ్రైవర్ యత్నం.. పోలీసులను చూసి పరార్

హైదరాబాద్‌: ఆత్మహత్య చేసుకుందామని పిల్లలతో సహా వచ్చిన ఓ వ్యక్తి... అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు రావడంతో అక్కడి నుంచి పరారైన ఘటన ఇది. ఈ ఘటన నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... హసన్ ఉల్ హక్ అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి ట్యాంక్‌బండ్‌‌కు వచ్చాడు. పిల్లలతో సహా ట్యాంక్‌బండ్‌‌లో దూకేందుకు యత్నించాడు.

Auto Driver attempt suicide at Tankbund along with three children

అదే సమయంలో లేక్ పోలీసులు అక్కడకు రావడంతో చిన్నారులను అక్కడే వదిలి హసన్ పరారయ్యాడు. ట్యాంక్ బండ్ వద్ద ముగ్గురు చిన్నారులను గమనించిన పోలీసులు వారిని తమ అదుపులోకి తీసుకున్నారు.

హసన్ కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం ఆ చిన్నారులను వారికి అప్పగించారు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన హసన్‌ ఉల్ హక్‌ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యా యత్నానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని వారు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+