ఓటింగ్ ను బహిష్కరించిన బంధంపల్లి గ్రామస్తులు .. ఎందుకంటే

దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో భద్రపరుస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. తెలంగాణా రాష్ట్రంలోనూ పోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ కొనసాగుతుంది .

Bandhampalli villagers boycott polling .. why because

రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండల పరిధిలోని బంధంపల్లి గ్రామస్థులు మాత్రం ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాన్ని పెద్దపల్లి మున్సిపాలిటీలో కలపకూడదన్న డిమాండ్ తో వారు పోలింగ్ కు దూరంగా ఉన్నారు. పోలింగ్ ప్రారంభమై రెండు గంటలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ ఓటు వేసేందుకు గ్రామస్థులు పోలింగ్ బూత్ వద్దకు రాలేదు . తమ డిమాండ్ ప్రభుత్వానికి తెలియజేయటం కోసమే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+