అరవింద్ ఫ్యామిలీకి ప్రాణహాని: టీఆర్ఎస్‌కు బండి సంజయ్ వార్నింగ్, కవితపైనా కేసు..
హైదరాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ములేక భౌతిక దాడులకు దిగి రౌడీయిజ చేస్తారా? అని బండి సంజయ్ నిలదీశారు.

టీఆర్ఎస్‌కు బండి సంజయ్ వార్నింగ్
బీజేపీ నేత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని వాళ్లు ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. గడీల గూండాల దాడులకు భయపడతామనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ సహనాన్ని చేతగానితనం అనుకోవద్దని, తమ కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరంటూ బండి సంజయ్ హెచ్చరించారు. టీఆర్ఎస్ గూండాలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

విమర్శలు చేస్తే దాడులా? అంటూ బూర నర్సయ్య
బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఈ దాడిపై మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలను.. ప్రతి విమర్శలతోనే ఎదుర్కోవాలని సూచించారు. అంతేకానీ, నేతలు ఇంట్లో లేని సమయంలో ఇలాంటి దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇలాంటి దాడులకు స్పందించి బీజేపీ శ్రేణులు ప్రతిదాడులకు దిగితే టీఆర్ఎస్ తట్టుకోగలదా? అని ప్రశ్నించారు. హింసను ప్రేరేపించే విధంగా రాజకీయాలు చేయడం సరికాదన్నారు.

ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత
ఇది ఇలావుండగా, బంజారాహిల్స్‌లోని బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అక్కడ్నుంచి టీఆర్ఎస్ భవన్‌కు నిరసన ర్యాలీకి సిద్ధమవగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అరవింద్ ఇంటిపై దాడి చేసినవారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడిపై సీపీ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా, ఎంపీ ఇంటిపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications