India
 • search
 • Live TV
సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ జైలుకే.. కేసీఆర్ బ్రోకర్‌లా..: తాలిబన్లు, రజాకార్లంటూ బండి సంజయ్ తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా సోమవారం ఇల్లంతకుంట చేరుకున్న బండి సంజయ్.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేటీఆర్‍ను బొక్కలో వేయిస్తాం.. కేసీఆర్ బ్రోకర్ అంటూ బండి సంజయ్

కేటీఆర్‍ను బొక్కలో వేయిస్తాం.. కేసీఆర్ బ్రోకర్ అంటూ బండి సంజయ్

బీజేపీ అధికారంలోకి వస్తే కేటీఆర్‌ను బొక్కలో వేయిస్తామంటూ హెచ్చరించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆరే కారణమని బండి సంజయ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో కేసీఆర్ బ్రోకర్ మాత్రమే.. కేంద్రమే పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని తీవ్రంగా స్పందించారు. పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు బండి సంజయ్. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిన కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

దళిత బంధు కొత్తేం కాదు.. మోడీ ‘స్టాండప్ ఇండియా’

దళిత బంధు కొత్తేం కాదు.. మోడీ ‘స్టాండప్ ఇండియా’

దళిత బంధు స్కీం కొత్తది కాదు.. ప్రధాని మోడీ ఏనాడో 'స్టాండప్ ఇండియా' పథకాన్ని ప్రవేశపెట్టారని బండి సంజయ్ తెలిపారు. అంబేద్కర్ గురించి సీఎం కేసీఆర్ ఏనాడూ మాట్లాడలేదన్నారు. అంబేద్కర్ పుట్టి పెరిగిన ప్రాంతాలను పంచ తీర్థాలుగా ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం.. స్టాండ్ ఆఫ్ ఇండియా ద్వారా దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతుందన్నారు. దళితుడ్ని రాష్ట్రపతిని చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని.. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ప్రభుత్వం కూడా తమదేననని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ నేతలు తాలిబన్లు, రజాకార్లలా.. తాను శివాజీలా అంటూ బండి

టీఆర్ఎస్ నేతలు తాలిబన్లు, రజాకార్లలా.. తాను శివాజీలా అంటూ బండి


తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు తాలిబన్ల లాగా.. రాజాకార్ల లాగా యుద్ధానికి వస్తే నేను శివాజిలాగా కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్తానన్నారు బండి సంజయ్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా.. విద్యా వాలంటీర్లను తొలగించిందని మండిపడ్డారు. తల్లిదండ్రుల మెడలో నుంచి పుస్తెలు అమ్ముకొని తమ పిల్లల్ని చదివిస్తే ఒక వ్యక్తికి కూడా ఉద్యోగం ఇవ్వని ప్రభుత్వం ఇదంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే చూస్తూ ఊరుకున్న ప్రభుత్వం కేసీఆర్‌దే అని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని ఆరోపించారు. తెలంగాణ కోసం 1400 మంది ఆత్మబలిదానాలు చేస్తే , కేసీఆర్ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.

  అప్రతిహతంగా కొనసాగుతున్న బీజేపి ఛీఫ్ బండి సంజయ్ యాత్ర!!
  ధర్మం కోసమే జైలుకెళ్లా.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

  ధర్మం కోసమే జైలుకెళ్లా.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్


  హైదరాబాద్‌లో వరదలు వస్తే కనీసం సీఎం చూడడానికి కూడా రాలేదని మండిపడ్డారు బండి సంజయ్. తాను హిందూ ధర్మం కోసం ఏడు సార్లు జైలుకు వెళ్లి వచ్చానట్లు తెలిపారు. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర తన యాత్ర మొదలుపెట్టానని.. తనకు భయం లేదన్నారు బండి సంజయ్. ఎంఐఎం పార్టీకి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. ఎంఐఎం పార్టీ వారు మోడీని ఓల్డ్ సిటీలో అడుగుపెట్టనివ్వం అంటున్నారు.. మోడీ దాకా ఎందుకు మీ బతుకులకు బీజేపీ కార్యకర్త చాలు అని తాను అంటున్నానని.. రాబోయేది పేదల ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వమే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ పాదయాత్ర 31వ రోజుకు చేరుకుంది. సోమవారం రాజన్న సిరిసిల్లలోని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి వరకు కొనసాగుతోంది.

  English summary
  Bandi Sanjay hits out at CM KCR and minister KTR.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X