అమెరికాలో బండి సంజయ్‌కి ఘన స్వాగతం: టైమ్స్‌స్క్వేర్‌లో ఫొటోలు
వాషింగ్టన్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అమెరికాలో అడుగుపెట్టారు. అక్కడి ప్రవాస భారతీయులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అట్లాంటాలో జరిగే ఆప్టా(అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) 15వ వార్షికోత్సవంలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించనున్నారు.
తమ అభిమాన నాయకుడు అమెరికాలోని అట్లాంటాకు వచ్చిన సందర్భంగా స్టార్ హీరోల ప్రకటనలు, సినిమా ట్రైలర్‌లు మాత్రమే కనిపించే టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డులో బండి సంజయ్, నరేంద్ర మోడీ ఫొటోలు, వీడియోలు వేసి ప్రవాస భారతీయులు తమ అభిమానం చాటుకున్నారు.

అమెరికా పర్యటనలో నార్త్ కరోలినా, వర్జీనియా, న్యూజెర్సీ, వాషిగ్టన్ డీసీ, డల్హాస్ రాష్ట్రాల్లో ఆత్మీయ సదస్సులు నిర్వహించనున్నామని.. బండి సంజయ్‌ను కలుసుకోవడం కోసం తెలంగాణ ప్రవాసులు ఆత్రుతతో ఎదరు చూస్తున్నారని బిల్ బోర్డు ఏర్పాటుదారుడు విలాస్ రెడ్డి జంబుల తెలిపారు. ఈ పర్యటనలో బండి పలు తెలుగు, తెలంగాణ ప్రవాస సంఘాలతో భేటీ అవుతారు.
అమెరికా పర్యటనలో బండి సంజయ్ అన్న ..@bandisanjay_bjp @BSKOffice 🔥🔥 #మనబండిసంజయ్అన్న 😊😊✊✊@SaiKumarNethas @Enagarajyadav @GayathriBDevi @NRavinderspeaks @SashiBajrangdal @BJP4Telangana pic.twitter.com/fVpmK1FE9x
— SRINIVAS BILLA🚩💪🔥✊ (@SrinivasBilla99) September 2, 2023
ఈ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, సాహిత్య, వైద్య, వ్యాపార, సేవా, నాటక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా, సెప్టెంబర్ 10న బండి సంజయ్ తిరిగి స్వదేశానికి రానున్నారు.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 2, 2023
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో బీజేపీని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లారు బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఊపును తీసుకొచ్చారు. అయితే, ఆయన పదవీ కాలం ముగిసిపోవడంతో బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. దీంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ అధిష్టానం బండి సంజయ్‌కు ప్రమోషన్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications