మోడీ వ్యాఖ్యలతో.. ప్రగతి భవన్‌లో చీలికలు: బండి సంజయ్ హాట్ కామెంట్స్
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు ఆస్తులు ఎక్కడ్నుంచి వచ్చాయో.. తెలంగాణ ప్రజలు ఆలోచించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ నిజస్వరూపాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బయటపెట్టారన్నారు. మోడీని చూస్తే కేసీఆర్ గజగజ వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ బుదవారం మీడియాతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ వ్యతిరేకిగా చూపేందుకు.. తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని బండి సంజయ్
ధ్వజమెత్తారు. తెలంగాణపై మోడీ విషం చిమ్ముతున్నారంటూ కేటీఆర్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా, ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా విషం చిమ్మడమేనా? అని ప్రశ్నించారు.

అభివృద్ధి వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ అని మండిపడ్డారు బండి సంజయ్. మోడీని టూరిస్టు అని కేటీఆర్ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది కేసీఆర్ కుటుంబం కోసమేనా? అని నిలదీశారు బండి సంజయ్. కేసీఆర్ నిజ స్వరూపాన్ని మోడీ బయటపెట్టారని.. ఇప్పుడు ప్రగతి భవన్‌లో అలజడి మొదలైందంటూ సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ నిట్టనిలువునా చీలడకం ఖాయమని బండి సంజయ్ జోస్యం చెప్పారు.
తెలంగాణలో ఇటీవలి కాలంలోనే మోడీ రూ. 20 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారని బండి సంజయ్ తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు నరేంద్ర మోడీ అందిస్తున్నారని ప్రజలకి తెలిసిపోయిందన్నారు. మోడీని ప్రపంచ దేశాలు ఒక హీరోలాగా చూస్తున్నారని.. ఇది మింగుడు పడని బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం దేశ ప్రధాని మీద చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో నలుగురు మాత్రమే బాగుండాలని కోరుకుంటున్నారని.. కేసీఆర్ కుటుంబం తప్ప వేరే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు ఎందుకు కావడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మోడీ పర్యటన తర్వాత ప్రగతిభవన్ లో భూకంపం వచ్చిందన్నారు. మోడీ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడితే కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ అయిందన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అనగానే బీఆర్ఎస్ పార్టీ చీలిపోయే పరిస్థితి ఏర్పడిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇదిలాఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ వరుస పర్యటనలు రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నాయి. నిజామాబాద్ సభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్.. ఎన్డీఏలో చేరేందుకు ప్రయత్నించిందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా దీనిపై స్పందిస్తూ.. తాము చేసిన విమర్శలు కరెక్టేనంటూ అభిప్రాయపడుతోంది. ఇదే క్రమంలో మంత్రి కేటీఆర్.. బండి సంజయ్ మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ట్విట్టర్ వేదికగా ఇరువురు నేతలు ఘాటైన విమర్శలు చేసుకుంటున్నారు.
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే రాజకీయం ఇలా ఉందంటే.. మున్ముందు మరింత హీటు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం









Click it and Unblock the Notifications