వరంగల్ భద్రకాళి ఆలయానికి మహార్దశ.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

తెలంగాణలోని అతిపురాతన ఆలయాలలో వరంగల్ భద్రకాళీ ఆలయం ఒకటి. తెలంగాణను పరిపాలించిన కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆనాటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. అయితే ఈ ఆలయానికి ఇప్పుడు మహార్దశ పట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. తమిళనాడు మధురైలోని మీనాక్షి అమ్మవారి దేవాలయం నమూనాలో అభివృద్ధి చేసేలా రూ.54 కోట్లతో ఇటీవల పనులను చేపట్టారు అధికారులు.

ఆలయం నలువైపులా గోపురాలు..

భద్రకాళీ ఆలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రత్యేక రోజుల్లో అమ్మవారి ఊరేగింపు కోసం 30 అడుగుల వెడల్పుతో మాడవీధులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీ స్థలాలను చదును చేస్తున్నారు. ఆలయం నాలుగువైపులా రాజగోపురాలు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రూ.24 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. మదురై, తంజావూరుకు చెందిన నిపుణులతో దేవాదాయ శాఖ ఇంజినీర్లు త్వరలో సమావేశమై చర్చించనున్నారు. ఇక ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనులను జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యవేక్షిస్తున్నారు.

Bhadrakali Temple to Undergo 54 Crore Makeover Inspired by Madurai s Meenakshi Temple

అమ్మవారి విగ్రహం 9 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు ఉంటుంది. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో 5 వేల మంది భక్తులు దర్శించుకోడానికి వస్తుండగా, ఏడాదికి నాలుగుసార్లు జరిగే ఉత్సవాలు, ప్రత్యేక రోజుల్లో 15 వేల మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బీఎస్‌ గణేశ్‌శాస్త్రీ దాతల సహకారంతో 1948లో ఆలయాన్ని పునరుద్ధరించారు.

ఆలయం చరిత్ర తెలిసేలా..

క్రీస్తు శకం 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం 625 ఏళ్లు ప్రాభవం కోల్పోయిన ఆలయానికి పునర్వైభవం కల్పించేలా 1948లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బీఎస్‌ గణేశ్‌శాస్త్రీ దాతల సహకారంతో పునరుద్ధరణ చేశారు. 1986లో దక్షిణ భారత ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ శిఖరం, మహామండపం, సాలహారాలను నిర్మించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భద్రకాళి ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+