హైదరాబాద్‌లో పోలీసులపైకి బీదర్ దొంగల కాల్పులు
హైదరాబాద్ నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో గురువారం రాత్రి కాల్పులు కలకం రేపాయి. కర్ణాటకలోని బీదర్‌లో గురువారం ఉదయం ఏటీఎం డబ్బును దోచుకున్న దొంగలను పట్టుకునేందుకు అక్కడి పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అఫ్జల్‌గంజ్‌లో పోలీసులను చూసిన దొంగలు వారిపై కాల్పులు జరిపారు.
అనంతరం స్థానికంగా ఉన్న ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లిన దొంగలు.. ట్రావెల్స్ మేనేజర్‌పై కాల్పులు జరిపారు. బ్యాగుల్లో డబ్బులు ఉండటాన్ని ప్రశ్నించడంతో దొంగలు ట్రావెల్స్ యజమానిపై కాల్పులు జరిపారు. ఆయన స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత దొంగలు అక్కడ్నుంచి పరారయ్యారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఈ క్రమంలో కాల్పులకు పాల్పడిన నిందితుల కోసం హైదరాబాద్ నగర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు.
కాగా, కాల్పులు జరిన నిందితుడ్ని అమిత్ కుమార్‌గా గుర్తించారు పోలీసులు. ట్రావెల్స్‌లో బుక్ చేసుకునే సమయంలో నిందితుడు తన ఐడీ కార్డు చూపించినట్లుగా ట్రావెల్స్ యజమాని తెలిపారు. అమిత్ కుమార్ తోపాటు అతనితో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింస్తున్నారు. బీదర్ నుంచి హైదరాబాద్ నగరానికి నిందితులు ఎలా వచ్చారనేదానిపై పోలీసులు విచారిస్తున్నారు.

బీదర్‌లో 93 లక్షలు దోచేసిన దొంగలు
కర్ణాటకలోని బీదర్‌లో అందరూ చూస్తుండగానే పట్టపగలే ఈ దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులకు పాల్పడిన ఇద్దరు దొంగలు.. రూ.93 లక్షలు ఉన్న నగదు పెట్టెతో పరారయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 10:30 గంటల సమయంలో బీదర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని శివాజీ చౌక్ వద్దనున్న ఎస్‌బీఐ ఏటీఎంలో దోపిడీ జరిగింది. ఇద్దరు దొంగలు ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు ముందుగానే చేరుకున్నారు. ఆ ఏటీఎంలో నగదును పెట్టేందుకు వచ్చే వాహనం రాక కోసం వాళ్లిద్దరూ ఎదురు చూశారు.
ಬೀದರ್: SBI ಸೆಕ್ಯೂರಿಟಿ ಏಜೆನ್ಸಿ ಸಿಬ್ಬಂದಿ ಮೇಲೆ ಗುಂಡಿನ ದಾಳಿ, ಒಬ್ಬನ ಸಾವು #bidar pic.twitter.com/rt5Vk4Evdo
— eedina.com ಈ ದಿನ.ಕಾಮ್ (@eedinanews) January 16, 2025
ఆ వాహనం వచ్చి ఆగిన తర్వాత, అందులోని డబ్బుల పెట్టెను సెక్యూరిటీ సిబ్బంది బయటికి తీశారు. ఏటీఎంలో క్యాష్‌ను లోడ్ చేసేందుకు డబ్బుల పెట్టెను తీసుకెళ్తుండగా.. సెక్యూరిటీ సిబ్బందిపై దొంగలు ఆరు రౌండ్ల కాల్పులకు పాల్పడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం నగదుతో కూడిన పెట్టెను దొంగలు తీసుకుని బైక్‌పై పరాయ్యారని పోలీసులు తెలిపారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అక్కడ్నుంచి హైదరాబాద్ వచ్చిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. తాజాగా కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
-
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications