ఐనవోలు మల్లన్న జాతరలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం
హన్మకొండ: చారిత్రక ఐనవోలు మల్లన్న జాతరలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. మల్లన్న దర్శనం కోసం వెళ్లే క్రమంలో దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యులు వారిని అడ్డుకున్నారు. అంతేగాక, దర్శనం టికెట్ చూపాలన్నారు. అప్పటికే అధికారులు చెప్పడంతో డీసీసీబీ ఛైర్మన్ రవీందర్ రావు రూ. 50 వేలతో 100 టికెట్లను కొనుగోలు చేశారు. ఆ టికెట్లు చూపినప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు అరగంటపాటు వారిని నిలిపేయడం గమనార్హం.
సంక్రాంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్సవాల్లో మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి శాసన మండలి వైస్ ఛైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, హనమకొండ జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, మాజీ రైతు రుణవిమోచన కార్పొరేషన్ ఛైర్మన్ నాగూర్ల వేంకటేశ్వర్లు వచ్చారు.

అయితే, మల్లన్న దర్శనం కోసం వెళ్లే క్రమంలో దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యులు వారిని అడ్డుకున్నారు. దర్శనం టికెట్ చూపాలని కోరారు. అధికారులు సూచించడంతో అప్పటికే డీసీసీబీ ఛైర్మన్ రవీందర్‌రావు రూ.50 వేలతో 100 టికెట్లను కొనుగోలు చేశారు. అవి చూపినప్పటికీ పాలకులు, పోలీసులు, దేవాదాయశాఖ అధికారులు ముఖద్వారం వద్ద తాళం వేసి అరగంట సమయం వారిని నిలిపివేశారు. అనంతరం ఎలాంటి ఆర్భాటం లేకుండా స్వామివారిని బీఆర్ఎస్ నేతలు దర్శించుకున్నారు.
కాగా, గతంలో ఎన్నడూ ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదని, ప్రసుత్తం అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యుల తీరుతో అసంతృప్తి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ విషయంపైన దేవస్థానం ఈవోను వివరణ కోరగా జాతరకు వచ్చిన ప్రముఖులు ఎవరైనా స్వామివారి దర్శనానికి రూ. 500 టికెట్ కొనుగోలు చేయాలని దేవస్థాన అధికారులు, పాలకులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం స్థానిక ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో తీర్మానించినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకే బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నట్లు, టికెట్లు చూపాలని కోరినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వివరణ ఇచ్చారు. కాగా, జనవరి నెల 13 నుంచి ఉగాది వరకు సాగే జాతరకు భక్తులు ముందుగానే వేలాదిగా తరలివస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications