ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం - తెర పైకి బండి సంజయ్..!!

తెలంగాణ ఎన్నికల రాజకీయం రంజుగా మారుతోంది. ఎత్తులు పై ఎత్తులతో పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ప్రచారంలో బీఆర్ఎస్ ముందు నిలిచింది. కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటనకు సిద్దం అవుతోంది. బీజేపీ 50 మందికి పైగా అభ్యర్దులతో తొలి జాబితా ప్రకటించనుంది. ఇదే సమయంలో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వస్తే బీసీకి సీఎం పదవి పైన ప్రకటన చేయనుంది. ఇదే సమయంలో బండి సంజయ్ పాత్ర కీలకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మారుతున్న రాజకీయం : తెలంగాణ ఎన్నికల్లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలను గమనిస్తున్న బీజేపీ కొత్త ఎత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో బీజేపీ కసరత్తు చేస్తోంది. మోదీ, అమిత్‌షా, నడ్డా ఆధ్వర్యంలో అర్ధరాత్రి వరకు జరిగిన ఈ సమావేశంలో పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

BJP decided to announce BC leader will be the Cheif Minister Of Telangana if party comes in to the power

రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించడమే కాకుండా.. తొలి జాబితాలోనే గోషామహల్‌ బరిలో రాజాసింగ్‌ టికెట్ ప్రకటించబోతోంది. బీసీలు, మహిళలకు మిగిలిన పార్టీల కంటే ఎక్కువ సీట్లు ఇచ్చే యోచనలో ఉంది. తెలంగాణలో సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా బీసీలకు అధిక సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది.

బీసీ కార్డుతో బీజేపీ : మొత్తం 119 స్థానాల్లో 12 ఎస్టీ, 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు మినహాయిస్తే.... 88 జనరల్ స్థానాలు ఉంటాయి. ఇందులో 40 సీట్లను బీసీలకు ఇచ్చే అంశం పైన కసరత్తు సాగుతోంది. జనసేనతో ఎన్నికల సర్దుబాట్ల పైన ఇప్పటికే చర్చలు జరగటంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే చర్చ సాగుతోంది. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వటంతో పాటుగా అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనే నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

బీసీ కార్డు తెలంగాణలో తప్పక మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. బీసీ నినాదం తమకు తిరుగులేని అస్త్రంగా మారుతుందని లెక్కలేసుకుంటోంది. తొలి విడతగా విడుదల చేసే లిస్టులో ముగ్గురు ఎంపీలు ఉన్నారని సమాచారం. గజ్వేల్, హుజూరాబాద్ నుంచి ఈటల పోటీ చేయనున్నారు. మునుగోడు నుంచి తిరిగి రాజగోపాల్ రెడ్డి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో జనసేనకు సీట్లు ఇవ్వాలనే చర్చ సాగుతోంది.

BJP decided to announce BC leader will be the Cheif Minister Of Telangana if party comes in to the power

బండికి ప్రాధాన్యత దిశగా : ఇక, బీసీ కార్డును ఈ ఎన్నికల్లో బలంగా ప్రయోగించాలని భావిస్తున్న బీజేపీ..ఈ సమయంలోనే మరోసారి బండి సంజయ్ కు కీలక పాత్ర ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ ఎమ్మెల్యేగా బరిలో నిలవటం దాదాపు ఖాయం అయింది. అయితే, బండిని ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించాలని పార్టీ సీనియర్లు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో బండి దూకుడు కారణంగానే పార్టీకి ఇమేజ్ పెరిగిందనే వాదన ఇప్పుడు పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో చివర్లో అయినా బండి లాంటి నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. దీంతో, ఇప్పుడు బండి సంజయ్ ను ఎన్నికల బరిలోకి దించుతూ..బీసీ కార్డు ప్రయోగం..బండికి ప్రాధాన్యత..పరోక్ష సంకేతాల ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ఢీ కొట్టాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+