టీడీపీతో పొత్తు ఉంటుందా : బీజేపీ ముఖ్య నేతల మీట్ లో చర్చ - క్లారిటీ..!!
బీజేపీ - టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ రెండు పార్టీల్లోనూ ఇది హాట్ టాపిక్ గా మారింది. దీని పైన తెలంగాణ బీజేపీ నేతలు స్పష్టత కోరారు. మాజీ ఎంపీ విజయశాంతి హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ప్రస్తావించారు. 2018 ఎన్నికల్లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని నష్టపోయిన అంశాన్ని ప్రస్తావించారు. మరి కొంత మంది ముఖ్య నేతలు టీడీపీతో పొత్తు పైన క్లారిటీ ఇవ్వాలని కోరారు. దీనికి పార్టీ నాయకత్వం స్పష్టత ఇచ్చింది. తాము చెప్పిన అంశాన్నే క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు చెప్పాలని నిర్దేశించింది.

టీడీపీతో బీజేపీకి పొత్తు ఉంటుందా
తెలంగాణలో బీజేపీ వర్సస్ బీఆర్ఎస్ గా మారిన పొలిటికల్ వార్ లో టీడీపీ రీ ఎంట్రీతో అనేక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. తెలంగాణలో బీజేపీతో టీడీపీ 2014 ఎన్నికల తరహాలో పొత్తు పెట్టుకొని..ఏపీలోనూ కొనసాగించేలా వ్యూహాలు అమలు చేస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ అధినాయకత్వం స్పష్టత ఇవ్వటం లేదు.
దీంతో, ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా.. హైదరాబాద్ శామీర్ పేట రిసార్ట్ లో జరిగిన బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మాజీ ఎంపీ విజయశాంతి, ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
టీడీపీ తమ పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తోందనే చర్చ వినిపిస్తోందని.. టీడీపీతో పొత్తు పైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ ఇద్దరు నేతలు ప్రస్తావించారు. అదే సమయంలో 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ - టీడీపీతో పొత్తు కారణంగా ఆ పార్టీ నష్టపోయిన అంశాన్ని నేతలు ప్రస్తావించారు.

కాంగ్రెస్ నష్టపోయింది..ఏం జరుగుతోంది
టీడీపీ ఖమ్మం సభ తరువాత తెలంగాణలో బీజేపీ - టీడీపీ మధ్య పొత్తు వ్యవహారం పైన అనేక రకాలుగా చర్చ సాగుతోంది. దీంతో..బీజేపీ నేతలు దీని పైన క్లారిటీ ఇవ్వాలని భావించారు. బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ తో పాటుగా సంస్థాగత ఇంఛార్జ్ సునీల్ బన్సల్ సమక్షంలో ఈ చర్చ ప్రస్తావనకు వచ్చింది.
టీడీపీతో పొత్తు కారణంగా కాంగ్రెస్ 2018లో ఏ రకంగా నష్టపోయిందో తనకు ప్రత్యక్షంగా తెలుసని విజయ శాంతి వివరించారు. విజయశాంతికి మద్దతుగా ఎంపీ అర్వింద్ తన వాయిస్ వినిపించారు. అయితే, దీని పైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చారు.
పార్టీ కార్యకర్తలకు ఇదే తెలియచేయాలని సూచించారు. గతంలోనూ దీని పైన పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్హణ్ పార్టీ నాయకత్వ నిర్ణయంగా స్పష్టత ఇచ్చారు. పార్టీ శ్రేణులకు పొత్తులు ఉండవనే విషయాన్ని స్పష్టం చేయాలని బండి సంజయ్ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.

పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
2014లో టీడీపీ -బీజేపీ కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేసాయి. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2017 లో రెండు పార్టీల మధ్య విభేదాలతో విడిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించేందుకు బీజేపీకి సహకారం అందించేందుకు టీడీపీ ముందుకొస్తోంది.
తద్వారా ఏపీలోనూ పొత్తుతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని వ్యూహాలు సిద్దం చేస్తోంది. కానీ, బీజేపీ అధినాయకత్వం దీని పైన స్పందించ లేదు. అటు ఏపీ..ఇటు తెలంగాణ నేతలు మాత్రం తమకు టీడీపీతో పొత్తు ఉండదని చెబుతూ వచ్చారు. జనసేనతో తెలంగాణలోనూ పొత్తు ఉండదనే విషయాన్ని గతంలోనే బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.
బీజేపీ తెలంగాణ నాయకత్వం మాత్రం టీడీపీతో పొత్తు వద్దని తమ పార్టీ నాయకత్వానికి స్పష్టం చేసింది. ఇప్పుడు ఇక టార్గెట్ 2023 పేరుతో ఎన్నికలకు సిద్దమవుతున్న బీజేపీ నాయకత్వం టీడీపీతో పొత్తు పైన పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చింది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications