స్మితా సబర్వాల్ పై చర్యలు?
తెలంగాణ రాష్ట్రంలో స్మిత సబర్వాల్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దివ్యాంగులను ఉద్దేశించి ఐఏఎస్ లో వారికి ప్రత్యేకమైన కోట అవసరం లేదంటూ స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఇక స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల నుంచి, అనేక రాజకీయ పార్టీల ప్రముఖుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
స్మితా సబర్వాల్ పోస్ట్ పై రగడ
స్మిత సబర్వాల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, తక్షణం దివ్యాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలనీ పెద్ద ఎత్తున ఆమెపై నిరసనలు వెల్లువగా మారాయి. మరోవైపు స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యల పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులతో ఆమెపై కేసు నమోదు అయింది. అయినప్పటికీ ఈ వ్యవహారంలో స్మిత సబర్వాల్ వెనక్కు తగ్గడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఒక్క మాట కూడా ప్రకటించలేదు.

బహిరంగ క్షమాపణ చెప్పాలి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
తాజాగా బాల లత స్మిత సబర్వాల్ కు చేసిన సవాల్ కు స్పందిస్తూ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఇక ఇదే సమయంలో స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను బిజెపి ఎంపీ లక్ష్మణ్ తప్పు పట్టారు. స్మితా సబర్వాల్ పెట్టిన పోస్ట్ దివ్యాంగులను కించపరిచే విధంగా ఉందని ఆయన విమర్శించారు. దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ తక్షణం బహిరంగక్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దివ్యాంగులుగా చట్టం అందుకే
ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదంగా ఉండాలన్న ఆలోచనలతో వికలాంగులు అనే పదం స్థానంలో దివ్యాంగులుగా వ్యవహరించాలని మోడీ ప్రభుత్వం 2016 లో చట్టం తీసుకువచ్చి, దివ్యాంగులకు గౌరవమైన స్థానాన్ని ఇచ్చిందని చెప్పారు. మోడీ ప్రభుత్వం చర్యతో దివ్యాంగుల మనోబలం పెరిగిందన్నారు.
స్మితా సబర్వాల్ పై చర్యలకు విజ్ఞప్తి
స్మిత సబర్వాల్ తాజా చర్య దివ్యాంగుల మనోబలాన్ని తగ్గించేలా ఉందని ఆ ట్వీట్ ను వెంటనే ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన స్మితా సబర్వాల్ కు సూచించారు, ఈ విషయం పైన ప్రభుత్వం కూడా స్పందించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని బిజెపి ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. మరి ఇంతగా విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ స్మితా సబర్వాల్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications