కరోనా వ్యాక్సిన్ తీసుకోనివారిలోనే బ్లాక్ ఫంగస్ తీవ్రత ఎక్కువ: వైద్యులు ఏం చెప్పారంటే.?
హైదరాబాద్: కరోనావైరస్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు సుమారు 35 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత తక్కువ ఉంటుందని, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

85 శాతం మంది బ్లాక్ ఫంగస్ రోగులు వ్యాక్సిన్ తీసుకోనివారే
అంతేగాక, కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిపై బ్లాక్ ఫంగస్ ప్రభావం కూడా తక్కువనే ఉంటోందని వైద్య నిపుణులు గుర్తించారు. కాగా, హైదరాబాద్ ఈఎన్టీ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ వ్యాధి బారినపడి చేరిన రోగుల్లో 85 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని వైద్యులు తెలిపారు. 7 శాతం మంది సింగిల్ డోసు తీసుకున్నవారు ఉన్నారు.
ఇప్పటికీ రోజుకు ఒకటి రెండు బ్లాక్ ఫంగస్ కేసులు వస్తున్నాయని, ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడంతో వీరి సంఖ్య బాగా తగ్గుపోయిందని వైద్యులు వెల్లడించారు. స్టెరాయిడ్స్ తీసుకోనప్పటికీ తక్కువ ఇమ్యూనిటీ ఉన్నవారిలోనూ బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోర్మైకోసిస్ గుర్తించినట్లు తెలిపారు.

ముక్కు, కళ్లపైనే బ్లాక్ ఫంగస్ ప్రభావం ఎక్కువ..
బ్లాక్ ఫంగస్ సోకిన బాధితుల్లో ఎక్కువ మందికి ముక్కు, కళ్లు ప్రభావితమయ్యాయని ఆస్పత్రి సీనియర్ వైద్యులు తెలిపారు. 71 శాతం మందికి ఆక్సిజన్ థెరపీ, 56 శాతం మంది రోగులకు రెమిడిసివిర్, కార్టికోస్టెరాయిడ్‌లపై 84 శాతం, 44 శాతం మందికి దీర్ఘకాలిక డయాబెటిస్ మెల్లిటస్, 50 శాతం మందికి కొత్తగా డయాబెటిస్ సోకినవారున్నారని తెలిపారు. .

డయాబెటీస్ రోగులకే బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు..
మనదేశంలో డయాబెటీస్ ఉన్న రోగులకే ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారని సీనియర్ వైద్యులు డాక్టర్ కిరణ్ తెలిపారు. కేరళ నుంచి సేకరించిన డేటా ప్రకారం ప్రతి నలుగురు డయాబెటీస్ పేషెంట్లలో ఒకరు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారని తెలిపారు.
మూడో వంతు ప్రజలు మాత్రమే డయాబెటీస్ పరిస్థితిపై అవగాహన కలిగివున్నారని చెప్పారు. ఈ కారణంగానే ఎక్కువ మంది బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారని చెప్పారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే బ్లాక్‌ఫంగ్ నుంచి సేఫ్..
కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల తీసుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ తీవ్రత చాలా తక్కువగా ఉందని ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మనీష్ గుప్తా తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనాతోపాటు బ్లాక్ ఫంగస్ తీవ్రతను తగ్గించుకోవచ్చని చెప్పారు. ఇతర సమస్యలు కూడా ఎదురుకాకుండా వ్యాక్సిన్లు పనిచేస్తాయన్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications