Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శివగిరి క్షేత్రంపై క్షుద్రపూజలు పోలీసుల అదుపులో నిందితులు

ప్రపంచంలో సర్వం టెక్నాలజీమయం అయిపోయింది. జనం 5జీ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. మనిషి అంతరిక్షంలో అడుగుపెట్టిన స్మార్ట్ యుగంలోనూ ఇంకా కొందరు మూఢ నమ్మకాలు పట్టుకు వేలాడుతున్నారు. అతీతశక్తులు సంపాదించేందుకు క్షుద్ర పూజలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపింది.

శివగిరి క్షేత్రంపై మంటలు

శివగిరి క్షేత్రంపై మంటలు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని శివగిరి క్షేత్రం. కాళీమాత నిలువెత్తు విగ్రహం కలిగిన ఈ ఆధ్యాత్మిక క్షేత్రం మూడురోజులుగా క్షుద్రపూజలకు ఆలవాలంగా మారింది. అతీతశక్తుల కోసం ఓ వ్యక్తి నగ్నంగా పూజలు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు.
ఆదివారం రాత్రి కరెంటు పోవడంతో బయటకు వచ్చిన స్థానికులకు శివగిరి క్షేత్రంపై పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతుండటం కనిపించింది. అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావించి కొండపైకి వెళ్లిన స్థానిక యువకులు అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు.

కాళీమాత ముందు క్షుద్రపూజలు

కాళీమాత ముందు క్షుద్రపూజలు

శివగిరి క్షేత్రంపై చుట్టూ మంట మండుతుండగా వాటి మధ్యలో ఒక వ్యక్తి నగ్నంగా కూర్చొని ఉన్నాడు. కాళీమాత ఆవాహన కోసం బిగ్గరగా మంత్రాలు జపిస్తున్నాడు. అతని చుట్టూ ఉన్న మంటలు ఆరిపోకుండా మరో ఇద్దరు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్షుద్రపూజ చేస్తున్న ప్రాంతంలో నిమ్మకాయలు, బలి ఇచ్చేందుకు తెచ్చిన పావురాలు, మేకలు, చేప పిల్లలతో పాటు బీర్ బాటిళ్లను స్థానికులు గుర్తించారు. మూడు రోజులుగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మాజీ ఆర్మీ జవాన్‌గా గుర్తింపు

మాజీ ఆర్మీ జవాన్‌గా గుర్తింపు

క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తులను హైదరాబాద్‌కు చెందిన కమల్, భరత్, సురేష్, రాజుగా గుర్తించారు. వీరిలో నగ్నంగా పూజలు చేసిన వ్యక్తి మాజీ సీఆర్పీఎఫ్ జవాన్ అని, అమ్మవారి సేవ చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దివ్యశక్తి పెంచుకునేందుకే తప్ప తన పూజల వల్ల ఎవరికీ కీడు కలగదని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+