జవహార్ నగర్ పేలుడు: ఇద్దరు చిన్నారుల మృతి, కూర కోసం స్టవ్ వెలిగిస్తే..(ఫోటోలు)
హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ జవహార్ నగర్‌లో ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడి ఉస్మానియా ఆసుపత్రి చికిత్స పొందుతున్న కీర్తివాణి (7), నరసమ్మ అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన యోగి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో జిలిటెన్‌స్టిక్స్ పేలినట్లుగా స్ధానికులు అనుమానిస్తున్నారు. పేలుడు ప్రమాదం సంభవించిన వెంటనే చిన్నారులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు కీర్తివాణి అనే బాలిక రక్తపు మడుగులో కొట్టు మిట్టాడుతుండటం స్ధానికుల హృదయాలను కలచి వేసింది.
మిగిలిన ఇద్దరు చిన్నారులను నరసమ్మ, యోగి గుర్తించారు. స్ధానికులు తెలిపిన సమాచారం ప్రకారం ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. రేకుల షెడ్డులాంటి ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు అద్దెకు ఉంటున్నట్లు సమాచారం. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. బండలమీద ఒత్తడితో పేలినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఐతే ప్రమాదానికి కారణమైన వస్తువు ఏంటో తెలియడం లేదని, విచారణ అనంతరమే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
కాగా, ప్రమాదానికి గురైన కుటుంబం శ్రీకాకుళం నుంచి నగరానికి వలస వచ్చినట్లు చెప్పారు. సెంట్రింగ్ పని చేసుకునే వాడని అన్నారు. పేలుడుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. సంఘటనా స్ధలంలోకి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు.
పేలుడు సమాచారం తెలిసిన వెంటనే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపానాథ్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయి వైద్య చికిత్సలు అందిస్తామని ఆయన ప్రకటించారు.

ఇంట్లో పేలుడు.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ జవహార్ నగర్‌లో ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఇంట్లో పేలుడు.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
ఈ ఘటనలో గాయపడి ఉస్మానియా ఆసుపత్రి చికిత్స పొందుతున్న కీర్తివాణి (7) మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన నరసమ్మ, యోగి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇంట్లో పేలుడు.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
ఈ ఘటనలో గాయపడి ఉస్మానియా ఆసుపత్రి చికిత్స పొందుతున్న కీర్తివాణి (7) మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన నరసమ్మ, యోగి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇంట్లో పేలుడు.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
ప్రమాదం జరిగినప్పుడు కీర్తివాణి అనే బాలిక రక్తపు మడుగులో కొట్టు మిట్టాడుతుండటం స్ధానికుల హృదయాలను కలచి వేసింది.

ఇంట్లో పేలుడు.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
మిగిలిన ఇద్దరు చిన్నారులను నరసమ్మ, యోగి గుర్తించారు. స్ధానికులు తెలిపిన సమాచారం ప్రకారం ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు.

ఇంట్లో పేలుడు.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
రేకుల షెడ్డులాంటి ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు అద్దెకు ఉంటున్నట్లు సమాచారం. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో పేలుడు.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
ప్రమాదం జరిగిన సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. బండలమీద ఒత్తడితో పేలినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంట్లో పేలుడు.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
ఐతే ప్రమాదానికి కారణమైన వస్తువు ఏంటో తెలియడం లేదని, విచారణ అనంతరమే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఇంట్లో పేలుడు.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
కాగా, ప్రమాదానికి గురైన కుటుంబం శ్రీకాకుళం నుంచి నగరానికి వలస వచ్చినట్లు చెప్పారు. సెంట్రింగ్ పని చేసుకునే వాడని అన్నారు. పేలుడుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

ఇంట్లో పేలుడు.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
సంఘటనా స్ధలంలోకి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇంట్లో పేలుడు.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
పేలుడు సమాచారం తెలిసిన వెంటనే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపానాథ్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఇంట్లో పేలుడు.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
క్షతగాత్రులకు పూర్తి స్థాయి వైద్య చికిత్సలు అందిస్తామని ఆయన ప్రకటించారు.
టామాటా కూర కోసం స్టవ్ వెలిగిస్తే పేలి మంటలు
శుక్రవారం ఉదయం జవహార్ నగర్‌లో పేలుడు సంభవించిన ఘటనలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. టామాటా కూర వండుదామని స్టవ్ వెలిగిస్తే పేలి మంటలు వచ్చాయని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసమ్మ తెలిపినట్లు సమాచారం.
జిలిటెన్‌స్టిక్స్ వల్ల పేలుడు సంభవించి ఉంటుందని స్ధానికులు భావిస్తుండటంతో సంఘటనా స్ధాలాన్ని పరిశీలించిన పోలీసులు ఆ వాదనను కొట్టిపడేశారు. గాయపడిన ఓ చిన్నారి వద్ద కిరోసిన్ డబ్బా ఉన్నట్లు సమాచారం.
ఆస్తి కోసం కన్న తల్లికి నిప్పంటించిన కొడుకు
ఆస్తి తన పేరు మీద రాసివ్వలేదని కన్న తల్లికి నిప్పింటించాడో కసాయి కొడుకు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా, ధన్వాడ మండలం మరికల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మరికల్ గ్రామ మాజీ సర్పంచ్ సరళ (43)కు, ఆమె కొడుకు హరితేజకు గత కొన్నాళ్లుగా ఆస్తి వివాదం నడుస్తోంది.
ఆస్తి తన పేరున రాయాలని హరితేజ తల్లితో గొడవ పడుతుంటే ఆమె మాత్రం నిరాకరిస్తుండేది. ఇదే విషయమై వారిద్దరి మధ్య తీవ్రస్థాయలో వాగ్వివాదం జరుగగా, కోపంతో హరితేజ తల్లికి నిప్పంటించాడు. ఆమె అక్కడికక్కడే కాలి బూడిద కాగా, హరితేజకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications