Harish Rao: బీఆర్ఎస్ ఎటు వైపు.. మహారాష్ట్రలో అలా.. జార్ఖండ్ లో ఇలా..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ లో స్పందించారు. మహారాష్ట్రలో 5 గ్యారంటీ కాంగ్రెస్ గారడీ పని చేయలేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. అక్కడి ప్రజలకు హస్తం పార్టీకి గుణపాఠం చెప్పారని అన్నారు. తెలంగాణలో మహిళలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిపారు. మహారాష్ట్రలో రూ.3000 ఇస్తామని ప్రకటించారని.. అక్కడి ప్రజలు ఇది నమ్మలేదని చెప్పారు.
ఆసరా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడాన్ని మహారాష్ట్ర ప్రజలు చూశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబయి, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలు వారికి అర్థమైనట్లు పేర్కొన్నారు.హేమంత్ సోరేన్ పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు.

మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యింది.
— Harish Rao Thanneeru (@BRSHarish) November 23, 2024
తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను
మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు.
తెలంగాణలో మహిళలకు ₹ 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో
₹3,000 ఇస్తామనడం, రైతు భరోసా…
విజయం సాధించిన హేమంత్ సోరేన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే జార్ఖండ్ లో హెమంత్ సోరెన్ తో పాటు కాంగ్రెస్ కూడా విజయం సాధించింది. బీజేపీ, కాంగ్రెస్ ను విమర్శించే బీఆర్ఎస్ మహారాష్ట్రలో కాంగ్రెస్ ను తప్పుబట్టింది.. అదే సందర్భంలో బీజేపీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటు జార్ఖండ్ లో బీజేపీని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ను ఏం అనలేదు. దీంతో బీఆర్ఎస్ ఎటువైపు అనేది అయోమయంగా మారింది. మహారాష్ట్రలో విజయం సాధించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. ఇది ప్రజా విజయమని పేర్కొన్నారు. మరోసారి నరేంద్ర మోదీ అభివృద్ధి మంత్రం పని చేసిందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications