హుజూరాబాద్‌లో ఈటలపై కేసీఆర్ పందెంకోడి..!!
కరీంనగర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో.. అధికార భారత్ రాష్ట్ర సమితి సమర శంఖాన్ని పూరించింది. అన్ని పార్టీల కంటే ముందుగా.. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 111 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు.
కేసీఆర్.. రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. తన కంచుకోట గజ్వేల్‌తో పాటు కొత్తగా కామారెడ్డిని ఎంచుకున్నారాయన. కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఎప్పట్లాగే సిరిసిల్ల నుంచి పోటీ చేయనున్నారు. సిద్ధిపేట్ నుంచి మంత్రి హరీష్ రావు రేసులో నిలిచారు.

ఈ లిస్ట్‌లో అందరి దృష్టీ హుజూరాబాద్ మీదా నిలిచింది. కరీంనగర్ జిల్లాలోని ఈ నియోజకవర్గంపై ప్రస్తుతం కాషాయ జెండా ఎగురుతోన్న విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్.. ఈ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2021లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈటల ఘన విజయం సాధించారు.
ఈటలకు హుజూరాబాద్ నియోజకవర్గం కంచుకోట. 2009 నుంచీ ఇప్పటివరకూ ఆయన ఇక్కడ జైత్రయాత్ర సాగిస్తూ వస్తోన్నారు. 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఈటల.. బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. కాషాయ కండువాను కప్పుకొన్నారు. 2021 ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు.

ఆయనపై యువనేత పాడి కౌశిక్ రెడ్డిని బరిలోకి దించారు కేసీఆర్. ఈ స్థానాన్ని ఆయన ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నారు. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. 2021లో ఎదురైన పరాజయాన్ని అధిగమించేలా విజయ కేతనాన్ని ఎగురవేయాలనే సంకల్పంతో ఉన్నారు బీఆర్ఎస్ బాస్.
ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ చేసిన ప్రయోగం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ 23 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అందుకే ఈ సారి పాడి కౌశిక్ రెడ్డినే రేసులో నిలిపారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి.. హుజూరాబాద్‌లో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. అన్ని గ్రామాలనూ చుట్టేస్తోన్నారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications