స్పీకర్ పై అవిశ్వాసం - బీఆర్ఎస్ కొత్త వ్యూహం..!?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పై చర్చ లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభలో గందరగోళం మొదలైంది. స్పీకర్ ను అవమానించేలా జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేసారని..కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. జగదీష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని పట్టు బట్టారు. దీనికి బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. తాము స్పీకర్ ను అవమానించలేదని స్పష్టం చేసింది. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయక పోతే అవిశ్వాసం పెడతామని చెప్పుకొచ్చింది.

సభలో గందరగోళం
తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీసాయి. ఆయన వాఖ్యల పైన కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ సభ్యులు వాదన చేసారు. దీంతో శాసనసభ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​ సభను వాయిదా వేశారు.
జగదీశ్ రెడ్డి తన ప్రసంగంలో..' ఈ సభ అందరిది, అందరికీ సమాన హక్కులు ఉంటాయని జగదీశ్​రెడ్డి అన్నారు. మా అందరి తరఫున పెద్దమనిషిగా స్పీకర్​గా మీరు కూర్చొన్నారు. అంతేగానీ ఈ సభ మీ సొంతం కాదని..' వ్యాఖ్యానించారు చేశారు. దీంతో స్పీకర్ స్పందించారు. సభా సంప్రదా యాలకు విరుద్దంగా మాట్లాడారని పేర్కొన్నారు.

BRS MLA Jagadeesh Reddy Comments on Speaker Congress demands action against him

జగదీశ్ రెడ్డి పై ఆగ్రహం
ఈ సమయంలో మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకున్నారు. జగదీశ్ రెడ్డి తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసారు. అహంకారంతో మాట్లాడుతున్నారని.. క్షమాపణ చెప్పాలని సూచించారు. స్పీకర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు సరి కాదని.. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ సైతం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. దీనికి సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించిన జగదీశ్ రెడ్డి తాను స్పీకర్ అధికారం గురించి మాట్లాడాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యే అడ్యూరి లక్ష్మణ్ ఫైర్​ అయ్యారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్​ను అవమానించారని ఆగ్రహించారు. జగదీశ్​రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు స్పీకర్​ను గౌరవించాల్సిన బాధ్యత లేదానని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ అవిశ్వాస ఆలోచన
సభలో గందరగోళం తో స్పీకర్ సమావేశం వాయిదా వేసారు. ఆ తరువాత సభలో జరిగిన పరిణామా ల ను మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కు వివరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం స్పందించారు. స్పీకర్ ను తాము అవమానించేలా మాట్లాడలేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసారు. పార్టీ సీనియర్ నేత హరీష్ తమ సభ్యులు స్పీకర్ ను ఏ విధంగానూ అవమా నించేలా మాట్లాడలేదని చెప్పారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయక పోతే అవిశ్వాసం పెడతామని వెల్లడించారు. ఇక, సభ తిరిగి ప్రారంభమైన తరువాత ప్రభుత్వం నుంచి జగదీశ్ రెడ్డి పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+