ఫస్ట్ రియాక్షన్: వారికి టికెట్ దక్కకపోవడం పట్ల కేటీఆర్ ఆవేదన
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో.. అధికార భారత్ రాష్ట్ర సమితి సమర శంఖాన్ని పూరించింది. అన్ని పార్టీల కంటే ముందుగా.. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 111 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు.
కేసీఆర్.. రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. తన కంచుకోట గజ్వేల్‌తో పాటు కొత్తగా కామారెడ్డిని ఎంచుకున్నారాయన. కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఎప్పట్లాగే సిరిసిల్ల నుంచి పోటీ చేయనున్నారు. సిద్ధిపేట్ నుంచి మంత్రి హరీష్ రావు రేసులో నిలిచారు.

అభ్యర్థుల జాబితాపై కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. తన కుమారుడు హిమాన్షు రావుకు కాలేజీలో జాయిన్ చేయించడానికి కుటుంబంతో కలిసి ఇటీవలే అమెరికా బయలుదేరి వెళ్లారు కేటీఆర్. అభ్యర్థుల జాబితాపై అక్కడి నుంచే ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
అభ్యర్థుల జాబితాలో చోటు దక్కిన వారందరికీ కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. తనను సిరిసిల్ల అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ మన్నె కృషాంక్ సహా మరికొందరికి అభ్యర్థుల జాబితాలో చోటు దక్కకపోవడం పట్ల కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
I congratulate all the nominees of the @BRSparty for ensuing assembly elections
— KTR (@KTRBRS) August 21, 2023
Also thank the Hon’ble Party President Sri KCR Garu for renominating me as a candidate from Siricilla 🙏
Disappointments are to be taken in stride in public life. Unfortunately some very deserving,…
ప్రజా జీవితంలో కొన్నిసార్లు నిరాశ తప్పదని వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తు కృషాంక్ సహా కొందరు అర్హులైన, సమర్థులైన నాయకులకు టికెట్ చోటు లభించలేదని కేటీఆర్ పేర్కొన్నారు. కృషాంక్ సహా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయిన మరి కొంతమందిని మరో రూపంలో అవకాశం దక్కుతుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications