Kavitha: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత..!
బీఆర్ఎస్ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రిలో చేరారు. ఆమె వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. కవిత తీహార్ జైలులో ఉన్నప్పుడు పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. కవిత గైనిక్, జ్వరంతో సహా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అప్పుడు కవితకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించారు. లిక్కర్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 15 కవితను అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 15న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కూడా అదుపులోకి తీసుకుంది.
దాదాపు నాలుగు నెలల తర్వాత కవితకు బెయిల్ వచ్చింది. కవితపై GNCTD చట్టం 1991, ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ (ToBR)-1993, ఢిల్లీ ఎక్సైజ్ చట్టం 2009, ఢిల్లీ ఎక్సైజ్‌ల ప్రాథమిక ఉల్లంఘించిందని కేసు నమోదు చేశారు. తాజాగా ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (ఛార్జిషీట్)ను రూస్ అవెన్యూ కోర్టులో సడ్మిట్ చేసింది. కవితతో పాటు ఇతర నిందితులు చన్‌ప్రీత్ సింగ్, దామోదర్, ప్రిన్స్ సింగ్, అరవింద్ కుమార్‌లపై చార్జిషీట్ దాఖలు చేశారు.

ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు అవకతవకలు జరిగాయని, లైసెన్స్ హోల్డర్‌లకు అనవసరమైన ప్రయోజనాలు కల్పించారని ఆరోపణలు రావడంతో ఈడీ, సీబీఐ ఎంటర్ అయింది. కవిత జైలు నుంచి వచ్చిన నుంచి కాస్త నీరసంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమెకు పరీక్షలు నిర్వహించేందుకు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. కాగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారు ఆడవారి పట్ల అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి కొండా సురేఖను ట్రోల్ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
కేటీఆర్ కు సంస్కారం లేదని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఇప్పటికైనా బలుపు మాటలు తగ్గించుకో అని కొండా సురేఖ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications