హైదరాబాదులో మరో దారుణం: బండరాయితో మోది బీటెక్ విద్యార్థిని అనూష హత్య
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులో మరో దారుణం జరిగింది. అనూష అనే విద్యార్థిని దారుణ హత్యకు గురయింది. ఆమె తలపై బండరాయితో మోడీ దుండగులు హత్య చేశారు.
అనూష బీటెక్ పూర్తి చేసింది. హయత్ నగర్‌లో ఉంటూ పోలీస్ ఉద్యోగానికి కోచింగ్ తీసుకుంటోంది. ఇందుకోసం ఇటీవలే హైదరాబాద్ వచ్చింది. అనూష స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ. కాగా, ఇటీవలే చందా నగర్‌లో ట్రిపుల్ మర్డర్ సంచలనం రేపిన విషయం తెలిసిందే.
Recommended Video


అతనే హత్య చేశాడా?
అనూషను నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పథకం ప్రకారం అతను హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. నాలుగు నెలల క్రితం అనూషకు మోతీలాల్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఫ్యామిలీ గొడవల కారణంగా పెళ్లి రద్దయింది. అయితే అనుషను తనకే ఇచ్చి పెళ్లి చేయాలని మోతీలాల్ కుటుంబ సభ్యులను బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఆమె హత్య రెండు రోజుల క్రితమే చోటు చేసుకుంది. అతనే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications