గీత భర్త ఇష్యూ: 'తలసాని కొడుకుతో కలిసి సెటిల్ చేసుకున్నాం'
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో కలకలం రేపిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వర రావు విషయమై బిల్డర్ కృష్ణ మీడియాతో మాట్లాడారు. తామంతా నిన్న సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు తాజ్ హోటల్లో ఉన్నామని చెప్పారు.
బిజినెస్ వ్యవహారంలో భాగంగానే తాను రామకోటేశ్వర రావును కలిసినట్లు చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుతో పాటు మరో ఇద్దరితో కలిసి సెటిల్ చేసుకున్నామని చెప్పారు. మాకు రామకోటేశ్వర రావు ఇవ్వాల్సిన రూ.13 కోట్లు ఇవ్వలేమని చెప్పారన్నారు.

దీంతో తాము రూ.5కోట్ల ఆస్తి పత్రాలు, లిఖిత పూర్వకంగా రాయించుకున్నామని చెప్పారు. తాను మద్యం తాగి ఉన్నానని చెప్పి తనను రామకోటేశ్వర రావు కొండాపూర్లో దించి వెళ్లారని చెప్పారు. తలసాని తనయుడు తమ కంటే ముందే పది గంటలకు వెళ్లిపోయారని చెప్పారు.
తలసాని సాయి యాదవ్ పై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు
అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావుపై బెదిరింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై తలసాని సాయి పైన కేసు నమోదైంది. రామకోటేశ్వర రావు ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు సాయి యాదవ్ పైన ఐపీసీ సెక్షన్లు 384, 342 కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో తన కొడుకు తప్పేమీ లేదని, అసలు రామకోటేశ్వర రావుపై తన కొడుకు బెదిరింపులకు పాల్పడలేదని మంత్రి తలసాని వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications