వెంకయ్య మన అదృష్టం: కేసీఆర్, విందుభేష్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం ఉంటుందని, అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సోమవారం హామీ ఇచ్చారు. జేఎన్ఎన్యూఆర్ఎం అమలు బాగుందని, జలహారం అద్భుతమని, సహకరిస్తామని మరో కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. కేసీఆర్ కేంద్రమంత్రుల నుండి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కోరారు.
వెంకయ్య నాయుడు ఉండటం తెలుగు వారి అదృష్టమని కేసీఆర్ ప్రశంసించారు. హైదరాబాద్‌పై కేసీఆర్ అద్భుతమైన ప్రెజంటేషన్ ఇచ్చారని, తెలంగాణకు వీలైనంత ఎక్కువ సహాయం చేస్తామని వెంకయ్య భరోసా ఇచ్చారు. ఢిల్లీలో సోమవారం కేసీఆర్ బృందానికి వెంకయ్య తన నివాసంలో విందు ఇచ్చారు. వీరు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ముందుకు వెళదామని వెంకయ్య వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన, త్వరలో చేపట్టబోయే పలు పథకాల కింద తెలంగాణకు వీలైనంత ఎక్కువ సహాయం అందిస్తామన్నారు. మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డి, వినోద్‌కుమార్, సీతారాం నాయక్, సుమన్, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులతో వెంకయ్యతో భేటీ అయ్యారు.

కేంద్రమంత్రులతో కేసీఆర్
కేసీఆర్ బృందానికి వెంకయ్య తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు, కార్యక్రమాలపై వెంకయ్యతో కేసీఆర్ విస్తృతంగా చర్చించారు.

కేంద్రమంత్రులతో కేసీఆర్
హైదరాబాద్ నగరాభివృద్ధి, పట్టణ గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా తదితరాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్రం వీలైనంత సహాయం చేయాలని కోరారు.

కేంద్రమంత్రులతో కేసీఆర్
స్మార్ట్ సిటీలు, దేశంలో గుర్తించిన 500 నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అందరికీ గృహ నిర్మాణం, సాంస్కృతిక వారసత్వ నగరాల అభివృద్ధి తదితరాలపైనా ఇరువురు నేతలూ చర్చలు జరిపారు.

కేంద్రమంత్రులతో కేసీఆర్
వివిధ నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల పరిస్థితిని అంచనా వేసుకోవాలని, తద్వారా కేంద్రం చేపట్టబోయే పలు పథకాలకు ప్రతిపాదనలు పంపించాలని కేసీఆర్‌కు వెంకయ్య సూచించారు. పెరుగుతున్న పట్టణీకరణ సవాళ్లను కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఎదుర్కోవాల్సి ఉందని తెలిపారు.

కేంద్రమంత్రులతో కేసీఆర్
ఇప్పటి వరకూ అమలైన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం లక్ష్యాలను సాధించడంలో వెనకబడిందని, ఈ నేపథ్యంలోనే, పట్టణ స్థానిక సంస్థల సామర్థ్యం, సంస్కరణల అమలులో వాటి పనితీరు, వనరుల్ని సమీకరించుకుని అవసరమైన సంస్కరణలను ముందుకు తీసుకెళ్లగల సత్తా ఉన్న నగరాలను స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగం చేయాలని కేంద్రం ఆసక్తిగా ఉందని కేసీఆర్‌కు వెంకయ్య తెలిపారు.

కేంద్రమంత్రులతో కేసీఆర్
అందరికీ గృహ నిర్మాణం పథకంలో కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన వనరులను జత చేసుకుని తమకు నచ్చిన సైజులో ఇళ్లను నిర్మించుకోవచ్చునని సూచించారు.

కేంద్రమంత్రులతో కేసీఆర్
తెలంగాణలో వెనకబడిన వర్గాలకు రెండు గదుల గృహాలు నిర్మించాలన్న ప్రభుత్వ పథకాన్ని అభినందించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద రూ.1,600 కోట్లు ఇవ్వాలని సమైక్య రాష్ట్రం ప్రతిపాదనలు పంపిందని, కానీ, ఆ పథకాన్ని గత యూపీఏ ప్రభుత్వం గత ఏడాది మార్చి 31వ తేదీతోనే ముగించిందన్నారు.

కేంద్రమంత్రులతో కేసీఆర్
కొత్తగా ప్రారంభించనున్న 500 నగరాల పథకంలో ఈ ప్రతిపాదనల్ని చేర్చి, తగిన విధంగా నిధులు మంజూరు చేస్తామని వెంకయ్య హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications