రేవంత్‌పై వ్యాఖ్యలతో కేసులు.. హైకోర్టులో కేటీఆర్ పిటిషన్లు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలతో నమోదైన కేసులపై హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు కేటీఆర్. బంజారాహిల్స్, ముషీరాబాద్ పీఎస్‌లలో నమోదైన కేసులు కొట్టేయాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డిని అవమానించారంటూ కాంగ్రెస్ కార్యకర్త ఫిర్యాదుతో కేటీఆర్‌పై బంజారాహిల్స్‌లో కేసు నమోదైంది. బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద సీఎం రేవంత్ రూ. 2500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్త బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు, ఎన్నికల ప్రచారంలో బాణాసంచా కాల్చినందుకు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మల్యే ముఠా గోపాల్‌పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు కేటీర్. ఎలాంటి కారణాలు లేకుండా పోలీసులు కేసులు నమోదు చేశారని పిటిషన్‌లో ఆయన తెలిపారు.
అయితే, తాను సీఎం రేవంత్ రెడ్డిని దురుద్దేశ పూర్వకంగా అవమానించలేదని, తన వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లలేదని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు మార్చి 18కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications