రేవంత్ దూకుడుకు మోదీ చెక్: ఎస్సీ వర్గీకరణకు కేంద్రం సై: కాంగ్రెస్ ఓటుబ్యాంక్ గల్లంతు
Lok Sabha elections 2024: లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించింది. ఇంకో రెండు నెలల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఈ క్రమంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి సంబంధించిన నిర్ణయం అది. కాంగ్రెస్‌కు అండదండగా ఉంటూ వస్తోన్న దళిత సామాజిక వర్గ ఓటుబ్యాంకును ప్రభావితం చేయొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిశీలించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అయిదుమంది ఉన్నతాధికారులతో ఆ కమిటీ ఏర్పాటైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా.. ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
కేంద్ర న్యాయ, గిరిజన, సామాజిక న్యాయం, డీఓపీటీ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ నెల 23వ తేదీన ఈ కమిటీ తొలి భేటీ ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది.
సుదీర్ఘకాలంగా ఈ డిమాండ్ వినిపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరన కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించిది. సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చాలాకాలంగా దీని కోసం పోరాడుతూ వస్తోన్నారు. ఆయన సమక్షంలోనే మోదీ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications