బాబు ఇబ్బంది పెడ్తున్నారు: కెసిఆర్, ఆంధ్రా పెత్తనం: బాల్క సుమన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంకా ఇబ్బంది పెడుతున్నారని, ఏపీ నుండి తెలంగాణకు రావాల్సిన కరెంట్ ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం మండిపడ్డారు.
ఆంధ్రా నేతలు ఇంకా పెత్తనం చెలాయించే యత్నం: బాల్క సుమన్
తెలంగాణ పైన ఆంధ్రా నేతలు ఇంకా పెత్తనం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. వారి ఆటలు ఇక చెల్లవని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కాటారం మండలంలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన ట్రైబల్ యూత్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటరును మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి పాల్పడుతోందని చెప్పారు. దళితుల సంక్షేమం కోసం కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు.
బీమా కంపెనీలకు పూర్తి సహకారం: కేటీఆర్
బీమా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇవాళ ఆయన ఐఆర్‌డీఏ ఛైర్మన్ విజయన్‌ను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతు కమతాలే యూనిట్‌గా పంటల బీమా ఉండాలన్నారు. ఈ నెల 11న ఐఆర్‌డీఏతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications