ఇక 100: తెలంగాణలో పదో తరగతి మార్కుల విధానంలో మార్పులు

తెలంగాణలో పదో తరగతి మార్కుల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం పదో తరగతిలో 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. దీంతో ఇకపై 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి.

2024-25 విద్య సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇకపై విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

Changes in the tenth grade marking system in Telangana

కాగా, గత కొన్ని సంవత్సరాలుగా గ్రేడింగ్ పద్ధతిలో రిజల్ట్స్ వచ్చాయి. తాజాగా, గ్రేడింగ్ సిస్టంను ఎత్తివేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇంటర్నల్ మార్కుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతోనే విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

డిగ్రీ ఇక రెండేళ్లే!

యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల డిగ్రీ కోర్సుల కాల వ్యవధిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. యూజీ విద్యార్థులు త్వరలో డిగ్రీ కోర్సుల వ్యవధిని తగ్గించుకునే, పొడిగించుకునే ఆప్షన్​‌ను పొందుతారని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు.

యూజీ విద్యార్థులకు తమ డిగ్రీ ప్రోగ్రామ్‌​ల వ్యవధిని వారి అభ్యాస సామర్థ్యం ఆధారంగా తగ్గించడం లేదా పొడిగించే విధంగా ఉన్నత విద్యా సంస్థలు త్వరలో ఒక ఆప్షన్‌​ను తీసుకురానున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

'విద్యార్థులు వారి అభ్యాస సామర్థ్యాల ఆధారంగా వారి డిగ్రీ కోర్సు వ్యవధిని తగ్గించడం, పొడిగించుకునే ఆప్షన్‌​ను ఎంచుకోవచ్చు. యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏడీపీ) ద్వారా ప్రతి సెమిస్టర్‌​లో అదనపు క్రెడిట్స్‌​ను సంపాదించడం ద్వారా తక్కువ సమయంలో మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును పూర్తి చేయవచ్చు' అని యూజీసీ ఛైర్మన్ తెలిపారు.

అంతేగాక, ఎక్స్‌టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఈడీపీ)తో డిగ్రీ కాలవ్యవధిని పెంచుకోవచ్చు. ప్రతి సెమిస్టర్‌​లో తక్కువ క్రెడిట్స్ వచ్చినవారు ఈ ఆప్షన్‌​ను ఎంచుకోవచ్చు. ఏడీపీ, ఈడీపీ ప్రోగ్రామ్​‌లకు విద్యార్థుల అర్హతను అంచనా వేయడానికి ఉన్నత విద్యాసంస్థలు కమిటీలను ఏర్పాటు చేస్తాయి. ఈ డిగ్రీలతో అన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సాధారణ డిగ్రీల్లానే వీటికి విలువ ఉంటుంది' అని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+