వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తెలంగాణ'ను గౌరవించాం: కేసీఆర్‌పై చిద్దూ ఆగ్రహం, మోడీ నోట్ల రద్దుపై..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, సెంటిమెంటును గౌరవించిందని ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం ఆదివారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, సెంటిమెంటును గౌరవించిందని ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం ఆదివారం అన్నారు. ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం ఈ ఏడాదిలో అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన మూడేళ్లలో తాను రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు.

Chidambaram lashes out at Modi and KCR

చిన్న రాష్ట్రాలు త్వరగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. అందుకు గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలే ఉదాహరణ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని నిలదీశారు.

దళితులకు మూడు ఎకరాల భూమి ఏమయిందని ప్రశ్నించారు. ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయన్నారు. పార్టీ ఫిరాయించిన వారి పైన చట్టపరంగా చర్యలు ఉండాలని చెప్పారు. ఈ విషయంలో స్పీకర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలన్నారు.

మోడీ మిషన్ నడుస్తోంది, ఆరో పెద్ద దేశంగా భారత్: ప్రజలు మారాలన్న వెంకయ్యమోడీ మిషన్ నడుస్తోంది, ఆరో పెద్ద దేశంగా భారత్: ప్రజలు మారాలన్న వెంకయ్య

కేంద్రం నిర్ణయాలు అన్నీ అయోమయంగా ఉన్నాయన్నారు. అమెరికా వంటి దేశాల్లోనే అరవై శాతమే డిజిటల్ లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. ఇక భారతదేశంలో ఎలా కుదురుతుందో చెప్పాలన్నారు.

English summary
Congress leader Chidambaram lashed out at PM Modi and Telangana Chief Minister KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X