రాకేశ్ మృతిపై సీఎం కేసీఆర్ విచారం - ఎక్స్‌గ్రేషియా : కేంద్ర దుర్మార్గ విధానాలతోనే..!!
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో సికింద్రాబాద్ స్టేషన్ రణరంగంగా మారిపోయింది. పోలీసుల కాల్పులకు దారి తీసింది. ఒక యువకుడు మరణించాడు. ఎనిమింది మంది కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పైన సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనలో రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మృతిచెందడం పట్ల ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. కేంద్రం అనుసరిస్తోన్న తప్పుడు విధానాల వల్ల రాకేశ్ మృతిచెందాడని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. దీంతో పాటుగా ఆ కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు వెల్లించారు. ఇక, రణరంగంగా మారిన సికింద్రాబాద్ స్టేషన్ లో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తత పరిస్థితులు క్రమేణా తగ్గాయి.

ఆందోళనకారులను పోలీసులు సాయంత్రానికి స్టేషన్ నుంచి బయటకు పంపటం తో పాటుగా స్టేషన్ ను పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. 9 గంటల సుదీర్ఘ ఉద్రిక్తతల అనంతరం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పరిస్థితులు దాదాపు అదుపులోకి వచ్చాయి. దీంతో అధికారులు షెడ్యూల్ రైళ్లను పునః ప్రారంభించారు.
కాకినాడ వెళ్లే రైలు ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి బయల్దేరింది. మెట్రో రైళ్లు సైతం తిరిగి ప్రారంభమయ్యాయి. అనేక రైళ్లను శివారు స్టేషన్ల నుంచి ప్రారంభించారు. కొన్ని రైళ్లు రద్దు చేయగా.. మరి కొన్నింటిని దారి మళ్లించారు. నాంపల్లి - కాచీగూడ - మౌలాలి స్టేషన్ల నుంచి పలు రైళ్లు బయల్దేరాయి. అయితే, కోట్ల రూపాయాల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాధమికంగా అంచనా వేసారు. ఇదే సమయంలో సికింద్రాబాద్ ఘటన మరెక్కడా చోటు చేసుకోకుండా అన్ని స్టేషన్లలో ముందస్తు భద్రతా చర్యలు ప్రారంభించారు. ఈ రోజు నుంచి రైళ్ల రాకపోకలు యధావిధిగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇక, స్టేషన్ లో జరిగిన దాడి పైన పూర్తి స్థాయిలో విచారణ మొదలైంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications