కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి: దుమ్మురేగుతుందంటూ కేసీఆర్ సీరియస్ వార్నింగ్

బాన్సువాడ: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో జరిగిన దాడి ఘటనపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం తనను బాధకు గురిచేసిందన్నారు.

ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటన విచారకరమని.. బాగా పనిచేసే నాయకులపై దాడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. ఎన్నికలు ఎదుర్కొనే దమ్ములేని వారే కత్తులతో దాడులకు దిగారని మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి తన మీద జరిగినట్లుగానే భావిస్తానని అన్నారు. హింసా రాజకీయాలను ప్రజలంతా ఖండించాలన్నారు.

 CM KCR serious warning on mp prabhakar reddy attack issue

బీఆర్ఎస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని.. తమకు తిక్కరేగితే దుమ్మురేగుతుందని కేసీఆర్ హెచ్చరించారు. దాడులకు దిగేవారు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేసే నాయకులపై ఇలాంటి దాడులు జరగడం విచారకరమన్నారు. మంత్రి హరీశ్ రావు.. కొత్త ప్రభాకర్ రెడ్డి వెంట ఉంటానని చెప్పడంతో తాను ఈ సభలో పాల్గొన్నానని తెలిపారు.

కాగా, దుబ్బాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పూరంపల్లిలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన ప్రభాకర్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రభాకర్ రెడ్డి వెంట ఆస్పత్రికి చేరుకున్న హరీశ్ రావు

అంబులెన్స్ లో ప్రభాకర్ రెడ్డిని ఆస్పత్రికి తీసుకురాగా.. మంత్రి హరీశ్ రావు తన కారులోంచి దిగి ఆస్పత్రికి పరుగెత్తుకుంటూ వెళ్లారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాకర్ రెడ్డికి సిటీ స్కాన్ చేశారని చెప్పారు. కడుపులో రక్తస్రావం అయ్యిందని తెలిపారని చెప్పారు. సర్జరీ చేయాల్సి ఉండటంతో ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారని తెలిపారు.

ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. సర్జరీ అనంతరం వివరాలు మీడియాకు చెబుతామని హరీశ్ రావు తెలిపారు. ఆయన కోలుకుంటారని, కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సాయంత్రం ఆస్పత్రికి వచ్చి ప్రభాకర్ రెడ్డిని పరామర్శిస్తారని చెప్పారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన రాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి, పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు రాజు ఏ పార్టీకి చెందినవారనేది తెలియదన్నారు. ప్రభాకర్ రెడ్డి బాడీగార్డ్ అప్రమత్తమై దాడి సమయంలో రాజును నిలువరించడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+