అలా చేస్తే ఉద్యోగాలు పోతాయ్, చీటికి మాటికి రోడ్డెక్కొద్దు: కెసిఆర్
హైదరాబాద్: విద్యా హక్కు చట్టం అమలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 వేలమంది టీచర్లకు పని లేకుండా పోతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీలో ప్రయివటేు స్కూళ్ల అధిక ఫీజుల బాదుడుపై జరిగిన చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.
యూపీఏ సర్కార్ హయాంలో మోడల్ స్కూల్ ప్రతదిపాదన వచ్చిందన్నారు. కేంద్రం పలు దఫాలుగా విద్యాశాఖలో సంస్కరణలు తెస్తోందని, ప్రైమరీ నుంచి యూనివర్సిటీ విద్య వరకు విద్యారంగంపై అన్ని స్థాయిల్లో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.
విద్యా విధానాన్ని ఒకే గొడుకు కిందకు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైమరీ పాఠశాల నుంచి యూనివర్సిటీ విద్య వరకు సభలో చర్చ జరగాలన్నారు. గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలను రద్దు చేస్తే విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు.
అందరం చర్చించి విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుందామన్నారు. విద్యా విధానాన్ని ఒకే గొడుకు కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుని మోడల్ పాఠశాలలను తీసుకొచ్చిందన్నారు.

కేజీ టు పీజీ విద్యా విధానం అమలుకు కూడా సమస్యలు వస్తున్నాయన్నారు. సమస్యలను అధిగమించేందుకు పలు రకాలుగా చర్చలు జరుపుతున్నామన్నారు. త్వరలోనే విద్యా విధానంపై చర్చ చేపట్టి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. చీటికి మాటికి విద్యార్థులు వీధుల్లోకి రావడం మంచికాదన్నారు.
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు: కడియం
అధిక ఫీజులు వసూలు చేసే ప్రయివేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. త్వరలోనే కామన్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామన్నారు.
ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి: కృష్ణయ్య
రాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలలకు సంబంధించి ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రయివేటు పాఠశాలల ఫీజు దోపిడీని నియంత్రించాలని కోరారు. ఒక యాజమాన్యం కింద వందల పాఠశాలలు ఉన్నాయన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి, ఒక యాజమాన్యం కింద ఒకే పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications