పదవులు రాకుంటే..: కెసిఆర్ బుజ్జగింపు, హరీష్ పేరు ప్రస్తావన
ఖమ్మం: పదవులు రాని వారు అసంతృప్తికి గురి కావొద్దని, వేచి చూడాలని, పార్టీ కోసం పని చేయాలని, సమయం వచ్చినప్పుడు అందరికీ పదవులు వస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ ఖమ్మం జిల్లా పార్టీ ప్లీనరీలో బుధవారం అన్నారు. మిషన్ కాకతీయను ప్రస్తావించి మంత్రి హరీష్ రావు దూసుకెళ్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఓ సందర్భంలో మంత్రి పదవి తనను వెతుక్కుంటూ వచ్చిందన్నారు. సమయాన్ని బట్టి అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. తెలివైన రాజకీయా నాయకులు పదవుల కోసం వేచి చూడాలని, అదే పార్టీ విధేయత అన్నారు. పదవులు రానంత మాత్రాన మనసు చిన్నబుచ్చుకోవద్దన్నారు.
మన శాసన సభ నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశముందని, అప్పుడు ఎమ్మెల్సీలు కూడా పెరుగుతాయని చెప్పారు. రాకున్నా నాయకులు పార్టీ కోసం పని చేస్తూ వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ ఎంపీ అవుతారని ఎవరూ ఊహించలేదని, అది అవకాశాలు వస్తాయనేందుకు నిదర్శనమన్నారు.
హైదరాబాద్ మేయర్‌గా బొంతు రామ్మోహన్ కూడా నాడు విద్యార్థి నాయకుడు అని, ఆయన మేయర్ అవుతాడని ఎవరూ ఊహించలేదన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు కూడా పార్టీ కోసం పని చేసి, పదవులు పొందారని అభిప్రాయపడ్డారు.
పార్టీ, ప్రభుత్వం జోడు గుర్రాల్లా పరుగెత్తాలన్నారు. వేలాది మార్కెటింగ్ కమిటీ పదవులు రానున్నాయని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి తన గెలుపు కోసం బాగా కృషి చేశారని, ఆ తర్వాత తాను రాజీనామా చేసినప్పుడు ఆయనకు ఎంపీగా అవకాశమిచ్చానని చెప్పారు. వేచి చూస్తే పదవులు వస్తాయన్నారు.
ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాల్లో విశ్రాంతి తీసుకుంటే అప్పుడే అతని పతనం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజలు ఇప్పుడు మనకు అద్భుతమైన మెజార్టీని కట్టబెడుతున్నారని, వారు మనల్ని ఆదరిస్తున్నారని చెప్పి ఊరుకోవద్దన్నారు.
ప్రజలు అప్పుడప్పుడు అద్భుతమైన తీర్పులు ఇస్తారని, ప్రజలను పట్టించుకోకుంటే వారు మనలను బండకేసి కొడతారని చెప్పారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా మనం చాలా వాటిని అమలు చేస్తున్నామన్నారు. మంచి పనులు అనుకుంటే మేనిఫెస్టోలో పెట్టకపోయినా చేస్తున్నామన్నారు.

హరీష్ రావు పేరు ప్రస్తావన
తెలంగాణ ఉద్యమం లక్ష్యమే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్నారు. నిధులు, ఉద్యోగాలు ఇప్పుడు మన చేతిలో ఉన్నాయని చెప్పారు. ఇక మనకు మిగిలిన లక్ష్యం నీరు అన్నారు. మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మిషన్ కాకతీయ కోసం కష్టపడుతున్నామన్నారు. తాగునీటి సమస్య శాశ్వత నివారణ కోసం మిషన్ భగీరథ అన్నారు.
కొన్ని వార్తలు చూస్తే బాధ వేస్తోందని, కళ్యాణ లక్ష్మి పెట్టినా, షాదీ ముబారక్ పెట్టినా కొన్ని పందికొక్కులు దూరి.. వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. వీటి పట్ల తెరాస కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గతంలో కొందరు నేతలు తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని చెప్పారని, కానీ వారి మాటలు అవాస్తవం అయ్యాయని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మన మిషన్ భగీరథను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని చెప్పారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications