సిట్టింగ్ లతో కేసీఆర్ సాహసం, మిషన్ 95 - రాజాసింగ్ కు ఛాన్స్..!?
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమరశంఖం పూరించారు. ఒకే విడతలో పార్టీ అభ్యర్దులను ప్రకటించారు. మొత్తం 119 స్థానాల్లో 115 స్థానాలకు తన పార్టీ అభ్యర్దులను ఖరారు చేసారు. ఏడు స్థానాల్లో సిట్టింగ్ లకు నో ఛాన్స్ అని చెప్పిన కేసీఆర్..మరో నాలుగు స్థానాలను మాత్రం ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. ఇదే సమయంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీఆర్ఎస్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. ఈ స్థాయిలో సిట్టింగ్ లకు అవకావం ఇవ్వటం సాహసమేనా.
సిట్టింగ్ లపై నమ్మకం : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏడు చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులకే ఛాన్స్ ఇచ్చినట్లు కేసీఆర్ ప్రకటించారు. గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో తాను పోటీ చేయనున్నట్లు సీఎం చెప్పారు.కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగు అభ్యర్థులకు టికెట్ నిరాకరించినట్లు సీఎం చెప్పారు. వైరా, ఆసిఫాబాద్, బోథ్, ఉప్పల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు సీఎం కేసీఆర్ వివరించారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించామని సీఎం వెల్లడించారు. నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి సీట్లు హోల్డ్‌లో పెట్టారు.

ముఖ్యమంత్రి ధీమా వెనుక : ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి నుంచి సిట్టింగ్ లకే ప్రాధాన్యత ఇస్తానని చెబుతూ వచ్చారు. చివరకు అదే చేసారు. కేవలం ఏడుగురిని మాత్రమే పక్కన పెట్టటం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. తన పాలన.. ప్రభుత్వం చేసిన సంక్షేమం గెలిపిస్తుందనే నమ్మకం..అదే తన ఎమ్మెల్యేలను గెలిపిస్తుందనే ధీమాతో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఎమ్మెల్యే అభ్యర్దుల ప్రకటన ప్రక్రియ పూర్తి చేసారు. ఎవరికి సీట్లు ఇచ్చే అవకాశం లేదో ముందుగానే వారికి సమాచారం ఇచ్చారు. వారికి భవిష్యత్ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నిరాశ లేకుండీ సీట్లు కేటాయించారు. పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్తారని భావించిన వారిని కట్టడి చేసారు.
బీఆర్ఎస్ అభ్యర్దుల జాబితా#BRS #BRSParty #TSElections #TelanganaElection2023 #KCR #Oneindiatelugu pic.twitter.com/TAgrSRm0pU
— oneindiatelugu (@oneindiatelugu) August 21, 2023
కేసీఆర్ టార్గెట్ 95 : ఇదే సమయంలో నాలుగు స్థానాలపైన కేసీఆర్ నిర్ణయం పెండింగ్ లో పెట్టారు. అందులో గోషామహల్ ఉంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారనే ప్రచారం ఉంది. ఈ కారణంగానే ఈ సీటు పైన అభ్యర్ది ప్రకటన నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలుస్తోంది. ఇక అభ్యర్దులు ప్రజల్లోనే ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అక్టోబర్ 16న వరంగల్ లో భారీ బహిరంగ సభకు కేసీఆర్ నిర్ణయించారు. ఆ సభా వేదికగానే పార్టీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఈ సారి ఎన్నికల్లో 95 సీట్లు గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. అసెంబ్లీలో గెలుపు ఖాయమని..ఫలితాలు వచ్చిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు..జాతీయ రాజకీయాలపైన ఫోకస్ చేస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications