అత్యంత కీలకం, మీదే బాధ్యత - తేల్చేసిన రేవంత్..!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ పెంచుతోంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది. మూడు ప్రధాన పార్టీల మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పార్టీలు.. కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. సీఎం రేవంత్ ఈ ఎన్నికను వ్యక్తి గతంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో మంత్రులకు జూబ్లీహిల్స్ లో మిగిలిన మూడు రోజుల ప్రచారం.. గెలుపు వ్యూహాల పైన దిశా నిర్దేశం చేసారు. ఏమరపాటుగా ఉండవద్దని స్పష్టం చేసారు.
జూబ్లీహిల్స్ ఎన్నిక పైన సీఎం రేవంత్ మంత్రులకు కీలక దిశా నిర్దేశం చేసారు. ప్రతి ఓటరును నేరుగా కలవాలని, ఈ మూడు రోజులు పూర్తిగా క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు. అదే విధంగా ప్రచారం పూర్తయిన తర్వాత ఓటింగ్ రోజున ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వచ్చేలా మంత్రు లు చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రచార గడువు ఈ నెల 9తో ముగియనుండటంతో ఈ మూడు రోజులు అత్యంత కీలకమని సీఎం చెప్పారు. ఏమాత్రం ఏమరుపాటు ఉండరాదని సీఎంం సూచించారు. పార్టీ ఇంఛార్జ్ సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి మొదట మంత్రులందరితో కలిసి మాట్లాడారు. తర్వాత ఒక్కో మంత్రితో విడివిడిగా కూడా మాట్లాడారు. ప్రధానంగా ప్రచార సరళి, గెలుపు వ్యూహాలు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టే వ్యూహ, ప్రతి వ్యూహాల గురించి చర్చించారు.

కాగా, నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు డివిజన్లు, పోలింగ్ బూత్‌ల వారీగా సర్వే నివేదిక ను ముఖ్యమంత్రులకు మంత్రులకు అందజేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గెలుపు, ఓటములను ప్రభావితం చేసే ఎక్కువ ఓట్లు కలిగిన సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కచ్చితమైన హామీ ఇచ్చి కాంగ్రెస్‌కు మద్దతు తెలిపేలా చేయాలని సీఎం సూచించారు. కాలనీలు, బస్తీలు, మురికివాడల వారీగా స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి నేతలు హామీ ఇచ్చి, ప్రతి గడపకు వెళ్లాలని ఆదేశించారు. ప్రతి ఓటరును నేరుగా కలిసి ఓటు అభ్యర్థించాలని, కాలనీ సంఘాలు, బస్తీ సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆయన చెప్పారు. మంత్రులు తమకు బాధ్యతలు అప్పగించిన డివిజన్లలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొనాలని సీఎం నిర్దేశించారు.












Click it and Unblock the Notifications