మహిళలకు సీఎం రేవంత్ మరో కానుక- పంపిణీ ముహూర్తం..!!

ముఖ్యమంత్రి రేవంత్ మరో కీలక ప్రకటన చేసారు. మహిళల కోసం వరుసగా పలు నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్.. మరో హామీ ఇచ్చారు. అన్నిరంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహి స్తోందని రేవంత్ చెప్పుకొచ్చారు. దేశంలోనే మొదటిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు.

నారాయనపేట లో సీఎం రేవంత్ కీలక నిర్ణయం వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది ఉన్నారని వివరించారు. ఇప్పటికే 600 ఆర్టీసీ బస్సులకూ మహిళలను యజమానులను చేశామని గుర్తుచేశారు. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మహిళా స్వయం సహా యక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చామ ని రేవంత్ చెప్పుకొచ్చారు

CM Revanth Announces another gift for Dwacra Women Assured support from Govt

త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇవ్వనున్నట్లు రేవంత్ ప్రకటించారు. సొంత ఆడబిడ్డలకు అందించినట్లు నాణ్యమైన చీరలను అందిస్తామని సీఎం చెప్పారు. మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసు కువచ్చేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. నిధులు తాము ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+