పీఏ కూతురు వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పీఏ కూతురు వివాహానికి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడలో బీఎంఆర్ సార్థ గార్డెన్స్‌లో గురువారం జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

సీఎం పర్సనల్ అసిస్టెంట్ (PA) పురుషోత్తంరెడ్డి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ముఖ్యమంత్రి దంపతులు ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, బుయ్యని మనోహర్ రెడ్డి, చిలుక మధుసూదన్ రెడ్డి సహా పలువురు నాయకులు వివాహానికి హాజరయ్యారు.

మంచి మనసు చాటుకున్న సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి తన మంచి మనసును చాటుకున్నారు. కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద యువకుడు గూళ్ల రాకేష్ (Rakesh) గురించి తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారు. తక్షణమే రాకేష్‌కు కావాల్సిన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఉచితంగా వైద్యం అందించడంతో పాటు రాకేష్ కోసం ఛార్జింగ్ వాహనాన్ని కూడా అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు (Vemula Srinivasulu) రాకేష్ కుటుంబీకులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం తరఫున హామీ ఇచ్చారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్య పల్లి గ్రామానికి చెందిన గూళ్ల రాకేష్ చాలా కాలం సూడో మస్య్కులర్ డిస్ట్రోఫీ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు.
ఇటీవల వ్యాధి తీవ్రత పెరగడంతో నడవలేని పరిస్థితికి వచ్చాడు. రాకేష్‌కు ఆరోగ్యం మెరుగు కావాలంటే ఖరీదైన ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇవ్వాలని వైద్యులు సూచించారు. పేదరికంలో ఉన్న రాకేష్ కుటుంబం ఖరీదైన వైద్యం చేయించలేకపోతుందని, పత్రికలో వచ్చిన కథనంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. తమ బిడ్డను ఆదుకోవడానికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాకేష్ తల్లిదండ్రులు గూళ్ల సమ్మయ్య, లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications