ఆ ఛాన్స్ మాకివ్వండి- ప్రధానికి రేవంత్ రిక్వెస్ట్

Revanth Reddy: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామీణ స్థాయిలో మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేయడానికి ప్రత్యేక విధానాలను అమలు చేస్తోన్నామని చెప్పారు. గ్రామీణ స్థాయిలో క్రీడారంగానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు.

ఈ ఉదయం హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నారు. ఎన్ఎండీసీ, హైదరాబాద్ రన్నర్స్ జాయింట్‌గా ఈ ఈవెంట్‌ను నిర్వహించాయి. దీనికి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లక్షలాదిమంది క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోన్నామని అన్నారు.

CM Revanth Reddy request to PM Modi Telangana is ready to be host Olympics 2036

ఇందులో భాగంగా- తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ నెలకొల్పబోతోన్నామని, వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు సైతం చేపడతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఖేల్ ఇండియా, జాతీయ క్రీడోత్సవాలను తెలంగాణలో నిర్వహించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని అన్నారు.

వాటితో పాటు 2036 నాటికి ఒలింపిక్స్‌ను నిర్వహించే అవకాశాన్ని తెలంగాణకు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. తమ వద్ద క్రీడోత్సవాలను చేపట్టడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు చాలినన్ని అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు. 2036 నాటి ఒలింపిక్స్‌ను భారత్‌లో జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలు చేస్తోన్నారని, ఆ అవకాశం ఒలింపిక్స్ నిర్వహణకు హైదరాబాద్‌‌ను ఎంపిక చేయాలని అన్నారు.

ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించడానికి అవసరమైన ఇన్‌ఫ్రా.. హైదరాబాద్‌లో ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశంలో నిర్వహించబోయే ఎలాంటి క్రీడోత్సవాలయినప్పటికీ వాటిని హైదరాబాద్‌కు కేటాయించాలని చెప్పారు. ఒక్క పొరపాటు కూడా చేయకుండా వాటిని విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+