కేసీఆర్ నిర్ణయానికి రేవంత్ బ్రేక్ - తొలిగించండి..!!

సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తున్నారు. కొన్ని మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా కొత్త సచివాలయం తరహాలో శాసనసభకు కూడా కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పుడు రేవంత్ ఈ నిర్ణయానికి బ్రేక్ వేసారు. శాసనసభ, శాసనమండలి, సెంట్రల్‌ హాల్‌ ఒకే భవన సముదాయంలో ఉండేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఒకే భవన సముదాయంలో
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నూతన శాసనసభ నిర్మాణం పైన కసరత్తు జరిగింది. ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తరువాత ఈ నిర్ణయం పైన సమక్షించారు. శాసనసభ, శాసనమండలి, సెంట్రల్‌ హాల్‌ ఒకే భవన సముదాయంలో ఉండేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం జూబ్లీ హాలులో ఉన్న శాసనమండలిని, పాత భవనంలోకి మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.

CM Revanth Reddy to conctinue Assembly, Council iin old builidng, key directions for officials

జూబ్లీహాలును మళ్లీ పునరుద్ధరించి, శాసనసభ, శాసన మండలి, సెంట్రల్‌ హాలును పాత పద్ధతిలో ఏర్పాటు చేయటంతో పాటు, ఆ ప్రాంగణాన్ని సుందరీకరించటం ద్వారా నగరంలో ఒక ప్రధాన పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

పాత భవనం పునరుద్దరణ
పాత భవనాన్ని పూర్తిగా పునరుద్ధరించనుండటంతో, జూబ్లీ హాలులోని శాసనమండలిని తిరిగి పాత మండలి భవనంలోకే మారుస్తారు. ఏపీకి కేటాయించిన శాసనసభ భవనాన్ని స్వా«దీనం చేసుకుని దాన్ని సెంట్రల్‌ హాల్‌గా మారుస్తారు. ఇక కొత్త భవనం వెలుపల ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల శాసనసభా పక్ష కార్యాలయాలు, మీడియా సెంటర్‌ ఉన్న భవనాన్ని తొలగించాలని నిర్ణయించారు. ఆయా కార్యాలయాలను పాత భవనంలో ఏర్పాటు చేస్తారు.

భవనం కూల్చిన ప్రాంతంలో పచ్చిక బయళ్లు ఏర్పాటు చేసి పబ్లిక్‌ గార్డెన్‌తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. గతంలో పబ్లిక్‌ గార్డెన్‌కు ఎంతో ప్రజాదరణ ఉండేది. సాయంత్రం వేళ ఎంతోమంది సందర్శించి సేద తీరేవారు. తాజాగా మళ్లీ దానికి పర్యాటక కళ తేవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది.

అసెంబ్లీలో మార్పులు
శాసనసభ ముందుభాగంలో గతంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం రోడ్డుపైకి అంతగా కనిపించటం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రోడ్డుమీద కంచెను ఏర్పాటు చేయటం కూడా దీనికి కారణమైంది. ఇప్పుడు ఆ కంచెను తొలగించి, వీలైతే గాంధీ విగ్రహాన్ని కాస్త ఎత్తు మీదకు మార్చి, ఆ ప్రదేశాన్ని మరింతగా సుందరీకరించి రోడ్డు మీదుగా వెళ్లేవారిని ఆకట్టుకునేలా చేయాలని నిర్ణయించారు.

గతంలో జూబ్లీ హాలు ప్రాంగణం సభలు, సందడిగా ఉండేది. శాసనమండలిగా మారిన తర్వాత కళ తప్పింది. ఇప్పుడు దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించారు. కేసీఆర్ హాయంలో సచివాలయ భవనానికి పునాది వేసిన రోజునే, ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ ప్రాంగణంలో శాసనసభ సముదాయానికి కూడా పునాది వేశారు. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పాత భవనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+