Revanth Reddy: సీఎం గొప్ప మనస్సు.. చనిపోయిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం..
భర్త కానిస్టేబుల్, భార్య గృహిణి.. వారికి పిల్లలు. ప్రశాంతంగా సాగిపోతున్న జీవితం. కానీ విధి ఆ భర్తను కాటేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో కబలించింది. భర్త మరణం ఆ కుటుంబం వీధిన పడింది. భర్త ఉద్యోగం కోసం భార్య ప్రయత్నించింది. కానీ ఆమెకు స్థానికత లేకపోవడంతో అధికారులు ఉద్యోగం ఇవ్వలేకపోయారు. కానీ తాజాగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు సడలించి మరి ఆమెకు ఉద్యోగం ఇచ్చి మానవత్వం చాటుకుంది.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో అంబర్ పేట పోలీసు హెడ్ హెడ్ క్వార్టర్స్ లో సొంగా శేఖర్ కానిస్టేబుల్ గా పని చేస్తుండేవాడు. అతను విధుల్లో ఉండగా.. 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో మృత్యవాత పడ్డాడు. దీంతో అతని కుటుంబం ఇబ్బందుల్లో పడింది. అతని భార్య సత్యలత ఏపీకి చెందినవారు కావడంతో అధికారులు ఆమెకు ఉద్యోగం ఇవ్వలేకపోయారు.

సత్యలత ప్రజావాణిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కుటుంబ పరిస్థితిని వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన రేవంత్ మానవతా దృక్పథంతో సత్యలతకు ఉద్యోగం ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. రేవంత్ ఆదేశాలతో సత్యలతకు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
రాచకొండ సీపీసుధీర్ బాబు సత్యలతకు మంగళవారం అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేశారు. ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్దవంతంగా నీతి, నిజాయితీతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications